స్కేట్ కారా మజకా..! పబ్ అందులోనే, కావాలనుంటే జిమ్ కూడా.. జస్ట్ పదిసెకన్లలో నచ్చినట్లు మార్చేయొచ్చట..!

-

మార్కెట్ లోకి రోజురోజుకి కొత్తకొత్త ఫోన్లు, కార్లు వస్తున్నాయి. ఒకదాన్ని మించి మరొకటి. వీటన్నింటిని తట్టుకునే ముందుకురావాలంటే మనం చేసేవాటిల్లో ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. లేకుంటే పక్కోడికి మనకు తేడా ఏముంటుంది. గొర్రెల మందలో మనము ఒక గొర్రె అయితే ఎప్పటికి అలానే ఉండిపోవాల్సివస్తుంది. అందుకే అందులోంచి కాస్తబయటపడితే అందరి చూపు మాన బ్రాండ్ మీదే ఉంటుంది. సరిగ్గా ఇలానే అనుకున్నారామో ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్. కొత్తరకమైన ఎలక్ట్రిక్ కారును రూపొందించారు. దీనికి ‘స్కేట్’ అని పేరు పెట్టారు. ఈ కారులో ఉండే ప్రత్యేకతలు చూస్తే ముక్కన వేలేసుకోవాల్సిందే..అవేంటో మీరు ఓ లూక్కేయండి.!
అదో బుజ్జికారు..సడన్ గా బయటకువెళ్లాలంటే మన ముందుకు వచ్చేస్తుంది. ఎంచక్కా లోపల కుర్చుని వెళ్లొచ్చు. ఓపెన్ టాప్ తరహాలో ఫ్రష్ ఎయిర్ ని పీలుస్తూ కూడా వెళ్లే వీలుంది. ఇంకా కారులో ‌వైన్ తాగాలనుకుంటే ఆ కారే చిన్నపాటి లాంజ్ గా మారిపోతుందట. అరే డ్రంక్ డ్రైవ్ ఎలా అనుకుంటున్నారా..ఈ కారు అటానమస్‌ / సెల్ఫ్‌ డ్రైవింగ్‌. అంటే డ్రైవర్‌ అవసరం లేకుండా.. మనం కోరుకున్న చోటికి అదే తీసుకెళ్తుంది.
అంతేనా ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండోయ్. వ్యాయామం చేయడానికి టైం లేదనుకుంటే.. కారే చిన్నపాటి జిమ్‌లా రెడీ అయిపోతుందట

సెకన్లలో మార్చేసుకోవచ్చు..

‘స్కేట్‌’ కారు.. పేరుకు తగినట్టుగా స్కేటింగ్‌ బోర్డులా ఫ్లాట్‌గా ఉంటుంది. దానికి బిగించుకోవడానికి మూడు బాడీలు (పోడ్స్‌) వస్తాయి. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ తరహాలో మెత్తని సోఫా, మినీ బార్‌తో కూడిన ‘సోఫిటెల్‌ వోయేజ్‌’ పోడ్‌ ఒకటికాగా.. వ్యాయామం చేయడానికి పలు పరికరాలతో కూడిన ‘పుల్‌మ్యాన్‌ పవర్‌ ఫిట్‌నెస్‌’ పోడ్‌ ఇంకొకటి. మూడోదేమో.. సగం క్యాబిన్, మిగతా సగం ఓపెన్‌ స్పేస్‌ ఉండే ‘సిటిజన్‌ ప్రొవైడర్‌’ పోడ్‌ ఉంటుంది. దీనిలో మొత్తం ఐదుగురు ప్రయాణించవచ్చు. ఈ పోడ్‌లలో ఒకదానిని వదిలేసి.. మరోదానిని కేవలం పది సెకన్లలోనే అమర్చేసుకునే వీలుంటుందట.

పక్కకూ కూడా నడపొచ్చట

సాధారణంగా మనంకారును స్టైట్ గానే నడుపుతాం..కానీ ఈ కారును ముందుకు, వెనక్కే కాదు.. పక్కలకు, ఐమూలగా ఎలాగంటే అలా నడపడానికి వీలుంటుంది. ఇందుకోసం బంతి ఆకారంలో ఉండే ప్రత్యేకమైన టైర్లను అమర్చారు. దీనిలో హైడ్రాలిక్‌ సస్పెన్షన్‌ ఏర్పాటు చేశారు. దాంతో పెద్దగా కుదుపులు లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు.. దీనిలో ఉండే రాడార్, లైడార్‌ సెన్సర్ల ద్వారా రోడ్డును, ముందున్న వాహనాలు, మనుషులు, ఇతర అడ్డంకులను గుర్తిస్తూ.. వాటి నుంచి పక్కకు తప్పుకుంటూ దూసుకెళ్తుందట.

మనం కారుదగ్గరకు వెళ్లక్కర్లా..అదే వచ్చేస్తుంది

ఈ కారు ఇంటర్నెట్‌ సాయంతో మన ఫోన్‌లోని యాప్‌కు లింక్‌ అయి ఉంటుంది. సో మనం ఎక్కడ ఉన్నా.. కావాలనుకున్నప్పుడు యాప్‌ నుంచి ఆదేశాలు ఇవ్వగానే మన దగ్గరికి బయలుదేరి వచ్చేస్తుంది. ఇంకా హైలెట్ ఎంటంటే.. దగ్గరిలో ఉన్న చార్జింగ్‌ స్టేషన్‌కు వెళ్లి అదే చార్జింగ్‌ కూడా చేసుకుంటుందని సిట్రోన్‌ కంపెనీ చెప్తోంది.
అయితే ఈ తరహా కార్లు ఇండియాకి ఇంకా రాలేదు. మీ అందరికి ఇప్పటికే ఒక డౌట్ వచ్చిఉండాలి..అయినా మన రోడ్లలో, ఈ ట్రాఫిక్ సమస్యల్లో ఇలాంటివి ఎప్పటికి నడవాలి అని..ఏమో కొన్ని సంవత్సరాలకు ఇండియాలో కూడా ఇలాంటి కార్లు తిరగొచ్చేమో.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news