నెల రోజుల పాటు ఫోన్‌కు దూరంగా ఉంటే.. రూ. 8 లక్షలు గెలుచుకోవచ్చు

-

ప్రపంచంలో వివిధ రకాల పోటీలు జరుగుతున్నాయి. రోజంతా బెడ్‌ మీదే ఉండి నిద్రపోతే. లక్షల్లో జీతం ఇస్తారు అని, వాళ్ల కంపెనీ బిస్కెట్లు తిని రివ్యూ చెప్పడం ఇలాంటివి మీరు వినే ఉంటారు. ఈరోజు మనం చెప్పబోయే కాంటెస్ట్‌లో అందుకు కాస్త భిన్నంగా ఉంటుంది.. ఈ పోటీలో గెలిస్తే లక్షల రూపాయల బహుమతి ఇస్తారు..నెల రోజులు ఫోన్‌కు దూరంగా ఉంటే చాలు..!

ఒక యోగర్ట్ కంపెనీ పోటీని నిర్వహిస్తోంది.. దీనిలో పోటీదారుడు తన మొబైల్ ఫోన్‌కు ఒక నెల పాటు పూర్తిగా దూరంగా ఉండాలి. అందుకు ప్రతిగా రూ.8 లక్షలు బహుమతి ఇస్తారు. పోటీని నిర్వహించే బ్రాండ్ పేరు సిగ్గి, ఐస్‌ల్యాండ్‌కు చెందిన పెరుగు బ్రాండ్ ఇది. ఈ పోటీ పేరు సిగ్గి అనే యోగర్ట్ బ్రాండ్ యొక్క ‘డిజిటల్ డిటాక్స్ ప్రోగ్రామ్’. ఈ పోటీలో మీరు ఒక నెల పాటు మీ మొబైల్ ఫోన్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ పోటీ ‘డ్రై జనవరి’ పోటీ నుండి ప్రేరణ పొందింది.

ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే వ్యక్తులు తమ స్మార్ట్ ఫోన్‌లను బాక్స్‌లో భద్రంగా ఉంచుకోవాలి. వచ్చే ఒక నెల పాటు వాటిని ఉపయోగించకూడదు. దీన్ని చేయగల పోటీదారుల నుంచి 10 మంది అదృష్ట విజేతలు ఎంపిక చేస్తారు. వారిలో ఒకరికి బహుమతి ఇస్తారు. $10,000 (రూ. 8.5 లక్షలు), అత్యవసర పరిస్థితుల కోసం ప్రీపెయిడ్ సిమ్ కార్డ్‌తో కూడిన రెట్రో ఫ్లిప్ ఫోన్,మూడు నెలల పాటు ఉచిత సిగ్గీ పెరుగు లభిస్తుంది.

ఈ పోటీకి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 31, దీని గురించి సమాచారం సిగ్గి వెబ్‌సైట్‌లో ఉంది. డిజిటల్ బ్రేక్‌లు మీ ఆరోగ్యానికి మంచిది.. అందుకే ఇలాంటి పోటీలను కంపెనీలు నిర్వహిస్తున్నాయి.. అయితే పోటీలో పాల్గొన్న అందరికి బహుమతులు రావని గుర్తుపెట్టుకోండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version