ట్విటర్‌పై మస్క్ సంచలన ఆరోపణ.. అవి 90% నకిలీవేనంటూ వ్యాఖ్య

-

ట్విటర్‌ను కొనాలన్న డీల్‌ని రద్దు చేసుకున్న ఎలాన్ మస్క్ తరచూ ఆ సంస్థపై వివాదాలు చేస్తూ వస్తున్నారు. ఆ డీల్‌ని ప్రతిపాదించిన నాటి నుంచి ట్విటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ట్విటర్‌లో 20 శాతం ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్విటర్ కామెంట్లపై మస్క్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తాను చేసే ట్వీట్లపై వచ్చే కామెంట్లలో 90శాతం నకిలీవేనని (స్పామ్‌/బాట్‌) అన్నారు.

మీకు వచ్చిన లైక్‌ల సంఖ్యలో అసలైన యూజర్లు, బాట్స్‌ నుంచి వచ్చే వాటిలో ఏమేరకు ఉంటాయని ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ట్విటర్‌ యూజర్లలో 20శాతం నకిలీవేనని ఉద్ఘాటించిన ఆయన.. తాజాగా తన ట్వీట్‌కు వచ్చిన ఓ రిప్లై గురించి వివరించారు. క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజీ సంస్థ బైనాన్స్‌ సీఈఓ చాంగ్‌పెంగ్‌ ఝావో పేరుతో వచ్చిన రిప్లై కూడా నకిలీదే అని అన్నారు. దాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి పోస్టు చేసిన మస్క్‌.. తన పోస్టులకు వచ్చే కామెంట్లలో 90శాతం బాట్‌ల నుంచే వస్తాయని తెలిపారు.

ట్విటర్‌లో ప్రతి పది అకౌంట్లలో ఎనిమిది నకిలీవేనని పేర్కొంటూ ఇటీవల ఓ సైబర్‌ నిపుణుడు ఇచ్చిన నివేదికపైనా ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ట్విటర్‌ చెబుతున్నట్లుగా అవి ఐదు శాతం కాదని.. అంతకంటే ఎక్కువే (దాదాపు 20శాతం) ఉంటాయని మరోసారి అనుమానం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news