చాలా మంది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లను చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఆర్ధిక సమస్యల వలన వాటిని గడువు తీరకుండానే క్లోజ్ చేసేస్తూ వుంటారు. అయితే ముందస్తుగా విత్‌డ్రాయల్ చేసుకుంటే పెనాల్టీ పడుతుంది. అయితే చాలా బ్యాంక్స్ పెనాల్టీని వెయ్యకుండానే ప్రీమెచ్యూర్‌గా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కలిపిస్తున్నాయి.
అలాంటి ఎఫ్‌డీని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఇస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఎస్‌బీఐ మల్టి ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. పూర్తి వివరాలను చూస్తే.. టర్మ్ డిపాజిట్ ఇది. సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లకు లింక్ చెయ్యచ్చు. ఎఫ్‌డీ నుంచి ఎప్పుడైనా పెనాల్టీ లేకుండా విత్‌డ్రా చెయ్యచ్చు.
ఈ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులను సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ఎవరైనా దీనిలో ఇన్వెస్ట్ చెయ్యచ్చు. సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల లానే ఈ వడ్డీ రేట్లు కూడా ఉంటాయి. సీనియర్ సిటిజన్లు 0.50 శాతం అదనంగా వడ్డీని పొందే అవకాశం వుంది.
ఎస్‌బీఐ మల్టి ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ టెన్యూర్ ఒక సంవత్సరం నుండి ఐదేళ్లు ఉంటుంది. విత్ డ్రాయల్ లిమిట్ అంటూ ఏమి లేదు. మల్టి ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌కి అనుసంధానమైన సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లో మంత్లీ బ్యాలెన్స్ ని ఉంచాల్సి వుంది. అలానే నామినేషన్ సౌకర్యం ఉంది.