మొదలైన Samsung Galaxy M04 సేల్‌..! అమెజాన్‌లో అందుబాటులో..

-

శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన గెలాక్సీ ఎం04 స్మార్ట్ ఫోన్‌ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్, శాంసంగ్ అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్‌ను విక్రయించవచ్చు. కేవలం ఒక్క వేరియంట్‌లోనే ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇది ఒక బడ్డెట్‌ ఫ్రెండ్లీ ఫోన్.. ధర పది వేలు లోపే ఉంది. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

శాంసంగ్ గెలాక్సీ ఎం04 ధర..

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.8,499గా నిర్ణయించారు. బ్లూ, గోల్డ్, మింట్ గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం04 కొనవచ్చు.
దీనిపై పలు లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎం04 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు.
వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఈ ఫోన్‌లో ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎం04 పని చేయనుంది.
5000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు.
ఇందులో ర్యామ్ ప్లస్ ఫీచర్‌ను అందించారు.
దీని ద్వారా ర్యామ్‌ను మొత్తంగా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు.
128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది. మైక్రో ఎస్‌డీ ద్వారా దీన్ని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version