యాపిల్ లవర్స్ కు గుడ్ న్యూస్..త్వరలోనే టెక్‌ ఫెస్టివల్‌..

-

కొన్ని బ్రాండ్ లంటే చాలా మందికి ఇష్టం.. అందులో యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. వాటి ధర ఎక్కువగా ఉన్నా కూడా కొందరు బ్రాండ్ కోసం ఖర్చు అయిన కొంటారు.మరి కొంతమంది అందులో ఉండే ఫీచర్స్ కోసం కొంటారు.అందుకే వరల్డ్ వైడ్ ఈ కంపెనీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. కాగా, యాపిల్ కంపెనీ త్వరలోనే టెక్‌ ఫెస్టివల్‌ ను నిర్వహించనున్నారు. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)- 2022ను జూన్ 6నుంచి జూన్ 10వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు యాపిల్‌ సంస్థ ప్రకటించింది.

ఈ డెవలర్స్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా యాపిల్‌ సంస్థ తాను విడుదల చేయబోయే గాడ్జెట్స్‌ గురించి ప్రకటన చేస్తుంది. అందుకే వచ్చే నెలలో జరగనున్న కాన్ఫరెన్స్ లో యాపిల్‌ ఏం ప్రకటన చేస్తుందోనని టెక్‌ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సందర్భంగా యాపిల్‌ సంస్థ ఆపరేటింగ్‌ సిస్టం అప్‌డేట్‌ల గురించి డబ్ల్యూడబ్ల్యూడీసీలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఐఓఎస్‌ 16, ఐపాడ్‌ ఐఓఎస్‌ 16, వాచెస్‌ ఓస్‌ 9 లలో అదనంగా కొన్ని ఫీచర్లను యాడ్‌ చేయనుందని తెలుస్తుంది.

ఈ నోటిఫికేషన్‌ల అప్‌డేట్‌తో పాటు కార్‌ క్రాష్‌ డిటెక్షన్‌, ఐపాడ్‌లలో కొత్త మల్టీ టాస్కింగ్‌ ఇంటర్‌ ఫేస్‌ తో పాటు మిగిలిన గాడ్జెట్‌ అప్‌డేట్‌ల గురించి ప్రకటన చేయనున్నట్లు సోషల్ మీడియాలో పలు నివేదికల ద్వారా ప్రకటించింది.. ఈ ప్రకటనల ద్వారా యాపిల్ ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ పెరగనుందని తెలుస్తుంది..మరి కొన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొని రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news