వాట్సాప్​లో మరో నయా ఫీచర్.. ఇకపై మెసేజ్​ను నచ్చినంత సమయం పిన్ చేసుకోవచ్చు!

-

వాట్సాప్​ యూజర్లకు గుడ్​ న్యూస్​. త్వరలోనే మరో నయా ఫీచర్​తో వాట్సాప్ మీ ముందుకు రానుంది. ఇంతకీ ఆ నయా ఫీచర్ ఏంటంటే.. ‘మెసేజ్​ పిన్​ డ్యూరేషన్​’ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా ఒక చాట్​లో లేదా గ్రూప్​లో ఒక మెసేజ్​ను పిన్​ చేసుకునే వెసులుబాటు కల్పించడం సహా, ఎంత సేపు పిన్​ చేసి ఉంచుకోవాలో యూజర్లు నిర్ణయించుకోగలుగుతారు. దీని ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని హైలెట్​ చేయడానికి, ఫ్యూచర్​ రిఫరెన్స్ కోసం దాచుకోవడానికి వీలవుతుంది.

వాట్సాప్​ అభివృద్ధి చేస్తున్న ఈ నయా ఫీచర్​ కనుక అందుబాటులోకి వస్తే, యూజర్లు వాట్సాప్​ చాట్​లో, గ్రూప్​లో నిర్దిష్ట సమయం వరకు మెసేజ్​ను పిన్​ చేసుకోవచ్చు. ఆ సమయం తరువాత ఆటోమేటిక్​గా ఆ మెసేజ్​ అన్ ​పిన్​ అయిపోతుంది. డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం, ఈ సరికొత్త ఫీచర్​ ద్వారా పిన్ మెసేజ్​​ డ్యూరేషన్​ 24 గంటలు, 7 రోజులు, 30 రోజుల వ్యవధి ఉండేలా వాట్సాప్​ ఆప్షన్స్​ ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version