మైక్రోసాఫ్ట్ విండోస్ యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఆఫీస్ ఫైల్స్‌తో అటాక్ అవుతున్న మాల్‌వేర్‌..

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ త‌న యూజ‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. విండోస్ 7 నుంచి విండోస్ 10 వ‌ర‌కు వ‌చ్చిన ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌తోపాటు విండోస్ 2008 ఆపైన వచ్చిన స‌ర్వ‌ర్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌ను ఉప‌యోగిస్తున్న వారు కొత్త మాల్‌వేర్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది.

micro-soft

 

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు చెందిన వ‌ర్డ్‌, ఎక్సెల్ ఫైల్స్ రూపంలో కొత్త మాల్‌వేర్ అటాక్ అవుతుంద‌ని మైక్రోసాఫ్ట్ హెచ్చ‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆ మాల్‌వేర్‌కు CVE-2021-40444 అని పేరు పెట్టారు. ఈ మాల్‌వేర్ ఉన్న ఆఫీస్ ఫైల్స్‌ను ఓపెన్ చేయ‌గానే విండోస్ పీసీలో ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ దానంత‌ట అదే ఓపెన్ అవుతుంది. త‌రువాత పీసీలో మాల్‌వేర్ డౌన్ లోడ్ అవుతుంది. అనంత‌రం అది పీసీ మొత్తానికి ఇన్‌ఫెక్ట్ అవుతుంది. ఈ క్ర‌మంలో కంప్యూట‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌దు.

అయితే యూజ‌ర్లు ఈ మాల్‌వేర్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని మైక్రోసాఫ్ట్ హెచ్చ‌రిస్తోంది. అప‌రిచిత వ్య‌క్తుల నుంచి వ‌చ్చే ఈ-మెయిల్స్ ను ఓపెన్ చేయ‌కూడ‌ద‌ని, విండోస్ అప్‌డేట్స్ ను ఎనేబుల్ చేసుకోవాల‌ని సూచించింది. త్వ‌ర‌లోనే దీనికి ఫిక్స్ ను డెవ‌ల‌ప్ చేసి ప్యాచ్ రూపంలో అందిస్తామ‌ని తెలిపింది. అప్ప‌టి వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది.