లక్క్‌ ఇదేరా.. ఐఫోన్ 13 ఆర్డర్ ఇస్తే ఏకంగా ఐఫోన్ 14 వచ్చింది..!!

ఆన్‌లైన్‌ షాపింగ్‌ విపరీతంగా పెరిగిపోతున్న ఈరోజుల్లో..చాలామందికి ఇప్పటికీ ఎందుకులో ఆన్‌లైన్‌లో అనే భావన ఉంది. ఒకటి ఆర్డర్‌ చేస్తే మరొకటి వస్తుంది అనుకుంటారు.. అవును చాలాసార్లు ఫోన్లు ఆర్డర్‌ చేస్తే సబ్బులు పంపారుని వార్తలు మనం వినే ఉంటాం.. అయితే ఇక్కడ ఒక అతను ఐఫోన్ 13 ఆర్డర్ ఇస్తే ఏకంగా ఐఫోన్ 14 వచ్చింది. లక్‌ అంటే ఇదే కదా..!మనోడు ఆనందానికి అంతులు లేవు..

ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బిగ్ బిలియన్ డేస్ సేల్ జరిగింది..మనమూ ఏదో ఒకటి కొనే ఉంటాం కదా..! కస్టమర్లకు భారీ తగ్గింపు ఆఫర్లు లభించాయి. అలాగే ఐఫోన్లపై కూడా దుమ్మురేపే డిస్కౌంట్లు ఉన్నాయి. దీంతో బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో చాలా మంది ఐఫోన్లు కొనుగోలు చేశారు. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ ఆర్డర్లు క్యాన్సిల్ చేసిందనే విమర్శలు కూడా వచ్చాయనుకోండి. అయితే ఇక్కడ మాత్రం ఒక వ్యక్తికి ఫ్లిప్‌కార్ట్ భారీ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఐఫోన్ 13 ఆర్డర్ ఇస్తే.. ఐఫోన్ 14 డెలివరీ ఇచ్చారు.

ఐఫోన్ 13 ధర రూ. 50 వేల వద్ద ఉంది. ఒక ట్విట్టర్ యూజర్ ఈ విషయాన్ని ట్వీట్‌ చేస్తూ… తన ఫాలోవర్లలో ఒకరికి ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే ఐఫోన్ 14 వచ్చిందని తెలిపారు. యూజర్ ఆర్డర్ వివరాలను, రిటైల్ బాక్స్ వంటి వటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆర్డర్ వివరాల ప్రకారం.. ఐఫోన్ కోసం రూ. 49,019 చెల్లించి ట్రాన్సాక్షన్ చేశాడు. అయితే ఇతనికి ఐఫోన్ 14 డెలివరీ అయ్యింది. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 80 వేలు వద్ద ఉంది.

ఐఫోన్ 13కి అప్‌గ్రేడ్ ఫోన్‌గా ఐఫోన్ 14ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఐఫోన్ 13లో 128 జీబీ మెమరీ, 6.1 అంగుళాల డిస్‌ప్లే, 12 ఎంపీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఏ15 బయోనిక్ చిప్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక లేటెస్ట్‌గా వచ్చిన ఐఫోన్ 14లో 128 జీబీ ర్యామ్, 6.1 అంగుళాల స్క్రీన్, 12 ఎంపీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఏ15 బయోనిక్ చిప్ వంటి పీచర్లు ఉన్నాయి. దాదాపు రెండింటిలోనూ ఫీచర్లు ఒకేలా ఉన్నాయని చెప్పుకోవచ్చు

ఇక ధరల విషయానికి వస్తే.. ఐఫోన్ 14 ధర రూ.79,900 నుంచి ప్రారంభం అవుతోంది. ఇప్పుడు ఐఫోన్ 13 ధర రూ. 59,990 నుంచి ఉంది. అంటే రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. దీంతో ఐఫోన్ 13 కాకుండా ఐఫోన్ 14 పొందిన వారికి లక్కీ ఛాన్స్‌ కొట్టినట్లే అయింది. అయితే కంపెనీ దీనిపై మళ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది తెలియరాలేదు..