యాపిల్ కు పోటినిచ్చే రెండు ఫోన్లను తెచ్చిన సోనీ.. ఫీచర్స్ అదుర్స్.. కెమేరా క్వాలిటీ నెక్స్ట్ లెవల్..!

-

Sony Xperia 1 IV, 10 IV ఫోన్లను సోనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్లు యాపిల్ ఫోన్ కే పోటీ ఇవ్వనుంది. మరీ ఆ రేంజ్ లో ఉన్నాయి ఈ ఫోన్ లో ఫీచర్స్.. ట్రూ జూమ్ సామర్థ్యం ఉన్న కొత్త తరహా టెలిఫొటో లెన్స్‌ను ఇందులో అందించారు. ఇంకా ఈ Sony Xperia 1 IV, 10IV ధర, కెమేరా క్వాలిటీ, బ్యాటరీ సమార్థ్యం ఎంత ఉన్నాయో చూద్దామా..!

సోనీ ఎక్స్‌పీరియా 1 ఐవీ ధర

ఈ ఫోన్ ధరను అమెరికాలో 1,599 డాలర్లుగా అంటే మన దగ్గర సుమారు రూ.1,23,500 నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సేల్ సెప్టెంబర్ నుంచి జరగనుంది.
అమెరికాలో ఈ ఫోన్‌ను అధికారిక సెల్లర్లు, కంపెనీ వెబ్ సైట్లో కొనుగోలు చేయవచ్చు.
ఆగ్నేయాసియా దేశాల్లో ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.
బ్లాక్, పర్పుల్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

సోనీ ఎక్స్‌పీరియా 1 ఐవీ స్పెసిఫికేషన్లు

ఇందులో 6.5 అంగుళాల 4కే హెచ్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని బెజెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి.
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏకంగా 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం.
డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 21:9గా ఉంది.
ఇందులో ఉన్న గేమ్ ఎన్‌హేన్సర్ ఆప్షన్ ద్వారా గేమ్‌ను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

సోనీ ఎక్స్‌పీరియా 1 ఐవీ బ్యాటరీ సమార్థ్యం..

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇందులో ఉన్న ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కనుంది.
స్టాక్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
అంటే పూర్తి స్థాయి ప్యూర్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చన్న మాట.

సోనీ ఎక్స్‌పీరియా 1 ఐవీ కెమేరా క్వాలీటీ..

ఫోన్ వెనకవైపు మూడు 12 మెగాపిక్సెల్ ఎక్స్‌మోర్ ఆర్ ఇమేజ్ సెన్సార్లను అందించారు.
వీటిలో ఒకటి 16 ఎంఎం అల్ట్రా వైడ్ లెన్స్ కాగా… 24 ఎంఎం వైడ్ లెన్స్, 85-125 ఎంఎం టెలిఫొటో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరానే అందించారు.

సోనీ ఎక్స్‌పీరియా 10 ఐవీ ధర..

ఇందులో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధరను అమెరికాలో 499 డాలర్లుగా (సుమారు రూ.38,500) నిర్ణయించారు. ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ నుంచి జరగనుంది.
ఆగ్నేయాసియా దేశాల్లో ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.
బ్లాక్, లావెండర్, మింట్, వైట్ రంగుల్లో సోనీ ఎక్స్‌పీరియా 10 ఐవీ కొనుగోలు చేయవచ్చు.

సోనీ ఎక్స్‌పీరియా 10 ఐవీ స్పెసిఫికేషన్లు..

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ5.1 వైర్‌లెస్ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లను ఇందులో అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

సోనీ ఎక్స్‌పీరియా 10 ఐవీ కెమేరా క్వాలిటీ..

వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు రెండు 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లు ఉన్నాయి. ఇందులో ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news