స్మార్ట్ ఫోన్ ను వాడేవారికి అలర్ట్..అవి ఉంటే అకౌంట్ ఖాళీ..

-

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడనివాళ్ళు ఉండరు.. అయితే ఫోన్ కొన్నిసార్లు ప్రమాదంలో కూడా పడవేస్తుంది..మనకు తెలియక కొన్ని యాప్స్ లను డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ లోకి వైరస్ కూడా వస్తుంది.వాటి గురించి తెలుసుకోకుంటే మాత్రం అకౌంట్ ఖాళీ అవుతుంది.జాగ్రత్తగా లేకపోతే మాత్రం సైబర్ నేరాల బారిన పడాల్సి వస్తుంది. సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ మాల్వేర్ బైట్స్ తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది.వైరస్‌ కలిగి ఉన్న గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ జాబితాను విడుదల చేసింది. బ్లాగ్ పోస్ట్‌లో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. వైరస్ బారిన యాప్స్ పిషింగ్ సైట్స్‌ను ఓపెన్ చేస్తున్నాయని కంపెనీ పేర్కొంది.

 

 

 

 

 

 

 

 

 

 

క్రోమ్‌లో ఈ యాప్స్ ఫిషింగ్ వెబ్‌సైట్లను ఓపెన్ చేస్తున్నాయని మాల్వేర్ బైట్స్ తెలిపింది. అందువల్ల స్మార్ట్‌ఫోన్ వాడే వారు ఇలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి.ట్రోజన్ మాల్వేర్ కలిగిన నాలుగు యాప్స్‌ను సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. వీటిల్లో బ్లూటూత్ ఆటో కనెక్ట్, బ్లూటూత్ యాప్ సెండర్, డ్రైవర్ బ్లూటూత్ యూఎస్‌బీ వైఫై, మొబైల్ ట్రాన్స్‌ఫర్ స్మార్ట్ స్విచ్ అనేవి 4 డేంజరస్ యాప్స్. అందువల్ల ఈ యాప్స్‌లో మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలేట్ చేసేయండి..

ఈ యాప్స్‌కు సంబంధించిన ఓల్డర్ వెర్షన్లలో కూడా మాల్వేర్ ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. అయతే మరోసారి వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంటోంది. ఈ యాప్ తొలిగా సాధారణంగానే కనిపిస్తాయని, అయితే తర్వాత మాల్వేర్ ప్రవర్తనను ప్రదర్శిస్తాయని మాల్వేర్ బైట్స్ సంస్థ పేర్కొంటోంది..ఈ యాప్స్ పై క్లిక్ చేస్తే ఇక అంతే..మీ డేటా మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుంది. అందుకే ఇలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి.వీటికి సంబంధించినవి ఏవైనా ఉంటే వెంటనే డిలీట్ చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news