త్వరలో లాంచ్‌ కానున్న Infinix Zero Ultra 5G..లీకైన ఫీచర్స్‌ ఇవే..!

-

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ త్వరలో జీరో అల్ట్రా 5జీ అనే ఫోన్ లాంచ్ చేయనుంది. సప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఫోన్‌ లాంచ్‌ కానుందని సమాచారం. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్‌ ఇప్పటికే లీక్‌ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుల్గాని ఈ ఫోన్ లాంచ్ టైమ్ లైన్, ఫీచర్లను ట్విట్టర్‌లో షేర్ చేశారు. లీకుల ప్రకారం.. ఫోన్‌ వివరాలు ఇలా ఉన్నాయి..
Infinix Zero Ultra 5G స్పెసిఫికేషన్స్‌ (అంచనా)
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
మిడ్ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ ఎంట్రీ ఇవ్వనుంది.
రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
6.7 అంగుళాల అమోఎల్ఈడీ లేదా కర్వ్‌డ్ డిస్‌ప్లే ఇందులో ఉండనుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
మధ్యలో హోల్ పంచ్ కటౌట్ కూడా ఉండనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉండనుంది.
ఏకంగా 180W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కే
వలం నాలుగు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ అంటోంది
అధికారిక ప్రకటనకు ముందే దీనికి సంబంధించిన కొన్ని రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. దీన్ని బట్టి డిజైన్ ఎలా ఉండనుందో తెలుసుకోవచ్చు. ఇన్‌ఫీనిక్స్ ఫోన్లకు మనదేశంలో కూడా మంచి డిమాండ్‌ ఉంది. ఇండియాలో కూడా ఫోన్‌ లాంచ్‌ అయ్యే అవకాశం లేకపోలేదు.
ఇక కెమెరా విషయానికి వస్తే..
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో 200 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉండనుందని సమాచారం. దీంతోపాటు టెలిఫొటో సెన్సార్, మాక్రో సెన్సార్ అందించనున్నారు.
ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే మనదేశంలో స్మార్ట్ 6 హెచ్‌డీ అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,799 ధరకే అందుబాటులో ఉంది. ఆక్వా స్కై, ఆరిజిన్ బ్లూ, ఫోర్స్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు

Read more RELATED
Recommended to you

Latest news