త్వరలో లాంచ్‌ కానున్న IQoo Neo7.. లీకైన్‌ ఫీచర్స్‌ ఇవే..!

-

ఐకూ నియో తన కొత్త ఫోన్‌ను లాంచ్‌కు రెడీ చేసింది. అదే ఐకూ 7 స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పటికే లీక్‌ అయ్యాయి. ధర కూడా రూ. 23 వరకూ ఉండొచ్చు. ఇంకా ఫోన్‌ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..
IQoo Neo7 ఫీచర్స్‌ (అంచనా)
మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుందని తెలుస్తోంది.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766వీ సెన్సార్ అందించనున్నారు.
120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఐకూ నియో 6 కంటే మెరుగైన ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
ఇందులో ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించనున్నారు.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇందులో ఐకూ అందించనుంది.
ఐకూ నియో సిరీస్‌లో ఇటీవలే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అదే ఐకూ నియో 6 ఎస్ఈ. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,999 యువాన్లుగా (సుమారు రూ.23,000) నిర్ణయించారు.
ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగానూ (సుమారు రూ.26,500), టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగానూ అంటే సుమారు రూ.28,850గా ఉంది.
ఇంటర్‌స్టెల్లార్, ఆరెంజ్, నియో కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
ఐకూ నియో 6 ఎస్ఈ స్పెసిఫికేషన్లు..
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఓషన్ కస్టం స్కిన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఐకూ అందించింది.
దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఐకూ నియో 6 ఎస్ఈ బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది.
80W ఫ్లాష్ చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుండటం విశేషం.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.854 సెంటీమీటర్లు కాగా… బరువు 190 గ్రాములుగా ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే… 
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news