Oneplus 10T గేమింగ్‌ స్మార్ట్‌ ఫోన్.. లీకైన ఫీచర్స్‌ ఇవే..!

-

వన్‌ప్లస్ నుంచి 10 సిరీస్‌లో భాగంగా కొత్త ఫోన్‌ను రెడీ చేసింది. వన్‌ప్లస్‌ 10టీ. జులై నెలాఖరుకు ఈ ఫోన్‌ లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. ఈలోపు ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌, కాస్ట్‌ లీకై అయ్యాయి. ఐటీహోం వెబ్‌సైట్ కథనం ప్రకారం…లీకైన ఫోన్‌ వివరాలు ఇలా ఉన్నాయి..

వన్‌ప్లస్ 10టీ ధర (అంచనా)..
వన్‌ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్ ధర చైనాలో 3,000 నుంచి 4,000 యువాన్లు అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.35,000 నుంచి రూ.47,000 మధ్య ఉంటుంది.
బ్లాక్, మింట్ గ్రీన్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ 10టీ స్పెసిఫికేషన్లు అంచనా..

ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీవో 2.0 అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉండనుంది.
హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో అందించారు.
స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉండనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉండనుంది.
150W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. అరగంటలోపే బ్యాటరీ ఫుల్‌గా చార్జ్ కానుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్‌లో అందించనున్నారు.
డ్యూయల్ స్పీకర్ సెటప్ ఇందులో ఉండనుంది.
బ్లూటూత్ వీ5.3 కనెక్టివిటీతో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది.

కెమెరా క్వాలిటీ..

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా అందించనున్నారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

ఈ ఫోన్ విడుదలైతే.. ప్రస్తుతం ఉన్న ప్రముఖ బ్రాండ్లకు గట్టిపోటీనే ఇస్తుందని టెక్‌ నిపుణుల అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Latest news