ఈ నెల 18న లాంచ్‌ కానున్న Realme 9i 5G స్మార్ట్‌ ఫోన్..ఫీచర్స్‌ ఇవే..!!

-

రియల్‌మీ 5జీ ఫోన్‌ రెడీ అవుతోంది. Realme 9i 5G పేరుతో రానుంది. ఆగస్టు 18వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. రియల్‌మీ 9ఐ 4జీ తర్వాతి వర్షన్‌గా ఈ ఫోన్‌ రానుంది. ఫోన్‌ను సంబంధించిన కాస్త సమాచారం కంపెనీ ప్రకటించింది. దాన్ని బట్టి చూస్తే ఇది కూడా బడ్జెట్‌ ఫోన్‌లానే ఉంది.. ఇంతకీ ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..
Realme 9i 5G స్పెసిఫికేషన్లు..
రియల్‌మీ 9ఐ 4జీ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది.
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో అందించారు.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా అందించారు.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, బైదు, గ్లోనాస్, డ్యూయల్ సిమ్, 4జీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ స్పీకర్లు కూడా అందించారు.
దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.
వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది.
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది.
ప్రిజం బ్లాక్, ప్రిజం బ్లూ రంగుల్లో లాంచ్ అయింది.
కెమెరా క్వాలిటీ..
కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను రియల్ మీ అందించింది.

Read more RELATED
Recommended to you

Latest news