ఇండియాలో లాంచ్ అయిన Vivo X80 Pro.. కెమేరా క్వాలిటీ వీరలెవల్..!

-

ఇండియాలో లాంచ్ అయిన Vivo X80 Pro.. కెమేరా క్వాలిటీ వీరలెవల్..! ఇండియాలో Vivo X80 Pro, Vivo X80 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. వివో ఎక్స్ 70 సిరీస్ తర్వాత వర్షన్గా ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ ఫీచర్స్ అదరగొడుతున్నాయి.. కాస్ట్ కూడా అలానే ఉందనుకోండి. రెండు ఫోన్లు కొనలాంటే.. లక్ష సరిపోదు. ఫోన్ ఫీచర్స్, కాస్ట్ ఎంతుందో చూద్దామా..!

వివో ఎక్స్80 ప్రో, వివో ఎక్స్80 స్మార్ట్ ఫోన్లు మనదేశంలో ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా లాంచ్ అయ్యాయి. గతంలో లాంచ్ అయిన వివో ఎక్స్70 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ సిరీస్ లాంచ్ అయింది. వివో ఎక్స్80లో మీడియాటెక్ డైమెన్సిటీ 8000 ప్రాసెసర్‌ను అందించగా… ఎక్స్80 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో సినిమాటిక్ స్టైల్ బొకే, సినిమాటిక్ వీడియో బొకే, 360 డిగ్రీ హారిజన్ లెవల్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లు ఉండటం విశేషం.

వివో ఎక్స్80 ధర..

ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటి వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది.
టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999గా ఉంది.
కాస్మిక్ బ్లాక్, అర్బన్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

వివో ఎక్స్80 ప్రో ధర..

ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.79,999గా ఉంది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే ప్రస్తుతానికి లాంచ్ అయింది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
కాస్మిక్ బ్లాక్ కలర్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఫోన్ల సేల్ మే 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

Vivo X80 Pro స్పెసిఫికేషన్లు..

6.78 అంగుళాల 2కే రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను అందించారు.
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కూడా ఉన్నాయి.
బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై వివో ఎక్స్ 80 ప్రో పనిచేయనుంది.
వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ వైర్‌లెస్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా… బరువు 219 గ్రాములుగా ఉంది.

కెమేరా క్వాలిటీ..

ఇందులో వెనకవైపు నాలుగు కెమేరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమేరా సామర్థ్యం.. 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జీఎన్వీ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్, 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్663 సెన్సార్, 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ షేప్డ్ అల్ట్రా టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందించారు.

Vivo X80 స్పెసిఫికేషన్లు..

6.78 అంగుళాల ఉన్న డిస్‌ప్లేనే అందించారు.
రిజల్యూషన్ ఫుల్ హెచ్‌డీ+గా ఉంది.
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

బ్యాటరీ సామర్థ్యం..

బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై వివో ఎక్స్ 80 పనిచేయనుంది.
దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా… బరువు 206 గ్రాములుగా ఉంది.

కెమేరా విషయానికి వస్తే..

వివో ఎక్స్80లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్866 ఆర్జీబీడబ్ల్యూ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news