108 మెగాపిక్సెల్‌తో Xiami 12 lite..కాస్ట్‌ ఎక్కువైనా..ఫీచర్స్‌ పర్ఫక్ట్‌..!

-

షియోమీ వరుసగా తమ స్మార్ట్‌ ఫోన్‌లను మార్కెట్‌లో లాంచ్‌ చేస్తుంది.తాజాగా షియోమీ 12లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించి ప్రీ ఆర్డర్లు కూడా ప్రారంభంకానున్నాయి. లాంచ్‌ డేట్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు కానీ.. స్పెసిఫికేషన్స్‌ మాత్రం లీక్‌ అయ్యాయి. షియోమీ అజర్‌బైజాన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు రివీల్ చేసింది. ఈ పోస్టు ప్రకారం ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లు జులై 8వ తేదీన ప్రారంభం కానున్ననట్లు తెలుస్తోంది..ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా షియోమీ అజర్‌బైజాన్ వెబ్ సైట్‌లో లిస్ట్ అవ్వలేదు.

షియోమీ 12 ధర…

దీని ధరను 999 అజర్‌బైజానీ మనత్‌లుగా అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ.46,400 నిర్ణయించారు.
బ్లాక్, పింక్, గ్రీన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

షియోమీ 12 స్పెసిఫికేషన్స్‌..

ఇందులో 6.55 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్‌ను కూడా అందించారు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్‌గా ఉండనుంది.
67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
షియోమీ 12ఎస్ సిరీస్ కూడా చైనాలో త్వరలో లాంచ్ కానుంది.
ఈ సిరీస్‌లో షియోమీ 12ఎస్, షియోమీ 12ఎస్ ప్రో, షియోమీ 12ఎస్ అల్ట్రా ఉండనున్నాయని సమాచారం.

కెమెరా క్వాలిటీ..

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ ఉంది,… దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
షియోమీ ఇప్పటికే కొత్త స్మార్ట్‌ ఫోన్లను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఇది కూడా లాంచ్‌ అయితే.. ప్రముఖ బ్రాండ్‌ కంపెనీ ఫోన్లకు పోటీ ఇస్తుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news