మరో ఫోన్‌ను రీబ్రాండ్‌ చేస్తోన్న షియోమి.. Poco M4s గా లాంచ్..!

రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌ను షియోమి గ్లోబల్‌ మార్కెట్‌లో Poco M4sగా రీబ్రాండ్‌ చేస్తోందని సమాచారం. షియోమి కంపెనీ రెడ్‌మీ బ్రాండ్‌తో రీబ్రాండెడ్‌ ఫోన్లను వివిధ మార్కెట్‌లో విడుదల చేస్తోంది.
ఈ టిప్‌స్టర్ ఇండియన్ MIUI కోడ్‌లో “Redmi Note 11 SE” అనే మోనికర్‌ను గుర్తించారు. ఈ డివైజ్ ఇప్పటికే ఉన్న Redmi Note 10Sకి రీబ్రాండ్ అవుతుందని కోడ్ స్ట్రింగ్స్ ప్రకటించాయి. అయితే కంపెనీ కొన్ని మార్పులతో పాత ఫోన్‌ను తక్కువ ధరలో అందించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
కంపెనీకి చెందిన MIUI కోడ్‌లో రెడ్‌మీ నోట్ 11 SE మోనికర్ ఉన్నట్లు చెప్తుంది. అంటే ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతున్నట్లే. ఈ డివైజ్, ఇండియాలో ఇప్పటికే ఉన్న రెడ్‌మీ నోట్ 10Sకు రీబ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇదే ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్స్ కోసం POCO M5sగా కంపెనీ రీబ్రాండ్ చేయనుంది. ఈ డివైజ్‌లలో RAM/స్టోరేజ్‌ తప్ప స్పెసిఫికేషన్ల పరంగా పెద్దగా తేడాలు ఉండవని సమాచారం. రెడ్‌మీ నోట్ 11 SE ధర రూ. 11,690 నుంచి ప్రారంభం కావచ్చు. ఈ ఫోన్ ఆగస్టు 29న లాంచ్‌ అవబోతుంది.
POCO M5s ఫోన్ 4GB/64GB, 4GB/128GB, 6GB/128GB స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది.
రెడ్‌మీ నోట్ 10S ఒరిజినల్ వెర్షన్ 8GB/128GB, 6GB/128GB, 6GB/64GB స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది.
తాజా మోడల్ MIUI 13 స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది.
అయితే ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఫోన్‌ను షియోమి వేరే పేరుతో, స్పెక్స్‌తో మళ్లీ లాంచ్ చేయాలని భావించడం మార్కెట్‌లో కాస్త గందరగోళానికే గురిచేస్తుంది. కంపెనీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో ఫోన్‌ విడుదలైతే కానీ తెలియదు.