మెక్సీకోలో లాంచ్‌ అయిన ZTE Blade V40 pro..ఫీచర్స్‌ ఇవే.!

-

మెక్సికోలో ZTE Blade V40 pro ఫోన్‌ మెక్సికోలో లాంచ్‌ అయింది. ఈ కంపెనీ నుంచి ఈ మధ్యే కొన్ని ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. త్వరలో ఇది ఇండియాకు వచ్చే అవకాశం కూడా ఉంది. మరీ ఈ స్మార్ట్‌ ఫోన్ ఫీచర్స్‌ ఎలా ఉన్నాయో చూద్దామా..

జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 ప్రో ధర..

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను 7,499 మెక్సికన్ పెసోలుగా (సుమారు రూ.29,000) నిర్ణయించారు.

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. డార్క్ గ్రీన్, ఐరీడీసెంట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 ప్రో స్పెసిఫికేషన్లు..
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఆక్టాకోర్ యూనిసోక్ టీ618 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 ప్రో బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్ కాగా, 65W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
కేవలం 50 నిమిషాల్లోనే ఈ స్మార్ట్ ఫోన్ 50 శాతం చార్జింగ్ ఎక్కనుంది.
దీని మందం 0.83 సెంటీమీటర్లుగా ఉంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ సిరీస్‌లో జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 5జీ, జెడ్‌టీఈ బ్లేడ్ వీ40, జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 ప్రో, జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 వీటా ఫోన్లు ఇప్పటికే లాంచ్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news