మొబైల్స్ తయారీదారు ఒప్పో రెనో6( Oppo Reno6), రెనో 6 ప్రొ పేరిట రెండు నూతన 5జి స్మార్ట్ ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. రెనో 6 ఫోన్లో 6.5 ఇంచుల డిస్ప్లే ఉండగా, రెనో 6 ప్రొ లో 6.55 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఈ రెండింటిలోనూ ఓలెడ్ తరహా డిస్ ప్లేలు ఉన్నాయి. రెండూ 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. అందువల్ల డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది.
ఒప్పో రెనో6 5జి ఫోన్లో.. 6.5 ఇంచుల డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11, డ్యుయల్ సిమ్, 64, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
ఒప్పో రెనో 6 ప్రొ 5జి ఫోన్లో.. 6.55 ఇంచుల డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11, డ్యుయల్ సిమ్, 64, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
ఇక ఒప్పో రెనో6 5జి ఫోన్ ధర రూ.29,990 ఉండగా, ఒప్పో రెనో 6 ప్రొ 5జి ఫోన్ ధర రూ.39,990గా ఉంది. ఈ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 23వ తేదీ నుంచి విక్రయించనున్నారు.