వాట్సాప్‌​లో పోల్ ఫీచర్… ఈ విధంగా క్రియేట్ చెయ్యండి..!

-

వాట్సాప్ మనకి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. వాట్సాప్ ద్వారా మెసేజెస్ ని పంపుకోచ్చు. అలానే వీడియో కాల్స్ ని కూడా చేసుకోవచ్చు. పైగా ఇంకా ఎన్నో ఫీచర్స్ వున్నాయి. అలానే రోజు రోజుకి కొత్త ఫీచర్స్ ని కూడా వాట్సాప్ తీసుకు వస్తోంది. తాజాగా వాట్సాప్ పోల్ ఫీచర్ ని తీసుకు వచ్చింది. ఒక ప్రశ్నకు 12 వరకు ఆప్షన్లుని తీసుకు వచ్చింది వాట్సాప్.

ట్విట్టర్ లో వున్నట్టే పోల్స్ క్రియేట్ చేసే ఆప్షన్ ని వాట్సాప్ తీసుకు రావడం జరిగింది. ఈ ఫీచర్ ని ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఒక ప్రశ్నకు 12 వరకు ఆప్షన్లు ని ఇవ్వచ్చు. ఒకే ఆప్షన్ రెండు సార్లు ఇస్తే మాత్రం తీసుకోదని వాట్సాప్ అంది.

దీని కోసం మొదట మీరు పర్సనల్‌ చాట్ లేదా, గ్రూప్ చాట్ ని ఓపెన్‌ చేయాలి.
ఇప్పుడు మెసేజ్ బాక్స్ పక్కన ఉన్న ప్లస్ సింబల్ ని ఐఓఎస్ యూజర్లు ఓపెన్ చేయండి. ఆండ్రాయిడ్ యూజర్లు అయితే పేపర్క్లిప్ సింబల్ మీద ప్రెస్ చేయాలి.
ఇప్పుడు మెనూ ఓపెన్ అవుతుంది. చివర్ మీకు పోల్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
దాని మీద క్లిక్ చేస్తే పోల్ ప్రశ్నను అడుగుతుంది. దీనికి సమాధానాలు ఇవ్వాలి.
సమాధానాల కోసం మొత్తం 12 ఆప్షన్లు వరకు ఇచ్చేయచ్చు. అయ్యాక సెండ్ చేస్తే చాలు.
పోల్ రిసీవ్ చేసుకున్న వారు జవాబు పైన క్లిక్ చేస్తే ఓటు నమోదవుతుంది.
ఇలా మీరు ఒపీనియన్ ని చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news