అదిరిపోయే ఫీచర్‌లతో రెడ్‌మి స్మార్ట్‌ వాచ్‌!

చైనీస్‌ దిగ్గజం షావోమీ కొత్తగా రెడ్‌ మీ వాచ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది రెడ్‌మి బ్రాండ్‌ నుంచి వచ్చిన మొదటి రెడ్‌మి స్మార్ట్‌ వాచ్‌ | Redmi Smart Watch కావడం విశేషం. ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

Redmi Smart Watch
రెడ్‌మి స్మార్ట్‌ వాచ్‌ | Redmi Smart Watch

ఈ రెడ్‌ మీ వాచ్‌ ప్రస్తుతం మార్కెట్‌లో 269 యువాన్‌లుగా నిర్ణయించారు. అంటే భారతీయ రూపీలో సుమారు రూ. 3,000. ఎలిగెంట్‌ బ్లాక్, ఇంక్‌ బ్లూ, ఇవోరీ బ్లూ రంగుల్లో షియోమీ వాచ్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

స్మార్ట్‌ వాచ్‌ ప్రత్యేక ఫీచర్లు..

  • ఎంఐ వాచ్‌లో 324 పీపీ పిక్సెల్‌ డెన్సిటీ, 2.5 డీ టెంపర్డ్‌ గ్లాస్‌ స్క్రీన్‌తోపాటు 1.4–అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ ఉంది. బ్యాటరీ సామర్థ్యం 230ఎంహెచ్‌ఏ.
  • నిరంతరం హార్ట్‌ మానిటరింగ్, స్లీప్‌ ట్రాకింగ్, హార్ట్‌ రేట్‌ వంటి సమాచారం కూడా 30 రోజుల రిపోరును సైతం అందిస్తుంది.
  • 120 వాచ్‌ ఫేసెస్, ఇండోర్, అవుట్‌ డోర్‌ రన్నింగ్, అవుట్‌ డోర్‌ , ఇండోర్‌ సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్‌ వంటి ఏడు స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఈ ఫోన్‌ కలిగి ఉంటుంది.
  • ఈ వాచ్‌ నీటిలో 50 మీటర్ల లోతు వరకు పనిచేయగలుగుతుంది. అంటే ఇది వాటర్‌ రెసిస్టెంట్‌. ఆండ్రాయిడ్‌ 5.0, ఆ పైబడిన, ఐఓఎస్‌ 10.0+ ఆ పైబడిన ఫోన్లకు దీన్ని లింక్‌ చేసుకోవచ్చు.