రూ.7,990కే వివో వై1ఎస్ స్మార్ట్ ఫోన్‌.. జియో క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే..!

-

మొబైల్స్ త‌యారీదారు వివో భార‌త మార్కెట్‌లో కొత్త‌గా వై1ఎస్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. కాగా ఈ ఫోన్ ను కేవ‌లం జియో క‌స్ట‌మ‌ర్ల కోస‌మే ప్ర‌త్యేకంగా లాంచ్ చేశారు. అందువ‌ల్ల వారే ఈ ఫోన్‌ను వాడుకునేందుకు వీలుంటుంది. ఇక ఈ ఫోన్‌తోపాటు జియో నుంచి అనేక ప్ర‌యోజ‌నాలు క‌స్ట‌మ‌ర్ల‌కు ల‌భిస్తాయి. ఈ ఫోన్ లో 6.22 ఇంచుల ఫుల్ వ్యూ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్‌ను ఇందులో అమ‌ర్చారు. 2జీబీ ర్యామ్ ఉంది. వెనుక వైపు 13, ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు దీంట్లో ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్‌, 4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు దీంట్లో ల‌భిస్తున్నాయి.

Vivo Y1s smart phone launched in india

వివో వై1ఎస్ స్పెసిఫికేష‌న్స్‌…

* 6.22 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్‌, 2జీబీ ర్యామ్
* 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10
* 13, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు
* డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ

వివో వై1ఎస్ స్మార్ట్ ఫోన్ ఆలివ్ బ్లాక్‌, అరోరా బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా ఈ ఫోన్ రూ.7,990 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన జియో క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.4,550 విలువైన ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. అలాగే 90 రోజుల షెమారూ స‌బ్‌స్క్రిప్ష‌న్‌, వ‌న్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ స‌దుపాయాలు కూడా ల‌భిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news