నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

Join Our Community
follow manalokam on social media

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది. ఒకానొక రోజు ఒక కుండ లోపలి భాగంలో సన్నపాటి రంధ్రం ఏర్పడుతుంది. దానివల్ల కొండమీదకి తీసుకువెళ్లేసరికి నీళ్ళు తగ్గిపోతాయి. ఒక కుండలో పూర్తిగా నిండిన నీళ్ళు వస్తుంటే మరొక దానిలో మాత్రం సగం నీళ్ళు మాత్రమే వస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన అమ్మాయి, అలాగే తీసుకొస్తూ ఉంది.4

ఒకానొక రోజు ఆ కుండ ఇదంతా చూసి, నా దాన్లో నీళ్ళు సగమే వస్తున్నాయి. నాకు రంధ్రం పడిందన్న విషయం గుర్తించకుండా నీళ్ళు మోసుకొస్తూనే ఉంది. నావల్లే వాళ్ళకి కావాల్సిన నీళ్ళు దక్కడం లేదని బాధపడుతూ ఉంది. తన పక్కనున్న కుండను చూస్తూ, నువ్వు చాలా మంచిదానివి. మనుషులకి కావాల్సిన నీళ్ళని నువ్వు అందిస్తున్నావు. నాకు లోపల రంధ్రం పడింది. నేనిప్పుడేం చేయాలి అని దిగులు పడుతూ ఉంది. ఇక ఏం చేయాలో తెలియక తాను పడుతున్న్న బాధను ఆ అమ్మాయికి చెప్పేసింది.

నాకు లోపలి భాగంలో రంధ్రం పడింది. అది తెలియక మీరు రోజూ నీళ్ళు మోసుకుంతూ వస్తున్నారు. అంది. దానికి ఆ అమ్మాయి ఈ విధంగా సమాధానం ఇచ్చింది. నీకు రంధ్రం పడిందని నాకు తెలుసు. అయినా నీళ్ళు ఎందుకు తెచ్చానో తెలుసా? అని కొండమీద నుండి నది వరకూ తాను నీళ్ళు తెచ్చే దారిని చూపించింది. ఆ దారిలో కుండలో నీళ్ళు కారిన చోట పూల మొక్కలు ఉన్నాయి. అందమైన పూల మొక్కలతో ఆ ప్రాంతమంతా శోభాయామానంగా ఉంది.

నీ నుండి కారుతున్న నీళ్ళన్నీ ఆ పూలమొక్కలకి పోయడానికే అలా చేసాను అని చెప్పింది. దాంతో ఆ కుండ సంతోషంతో ఊగిపోయింది. చాలా మంది ఇదే చేస్తుంటారు. తమలో ఉన్న లోపాలను మాత్రమే చూసుకుంటూ బాధపడతారు. ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతీ ఒక్కరిలో లోపాలుంటాయి. మరి అలాంటప్పుడు మీరు మాత్రం మీ లోపాలని చూసుకుంటూ ఎందుకు బాధపడాలి? వాటిని పక్కన పెట్టి బయటకి చూస్తే మీ ప్రపంచ విశాలమవుతుంది. మీలో మీరు ఏం చేస్తున్నారో కాదు, ప్రపంచం ఏమి చూస్తుందో తెలుసుకోండి. అప్పుడిక అనవసర దిగులు మీ చెంతకి రాదు. విజయం మీ సొంతం అవుతుంది. డేర్ టూ మోటివేషన్ ఆధారంగా.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...