గుప్పెడంతమనుసు 288: పెళ్లికి వసూని తీసుకెళ్లేందుకు పర్మిషన్ కోసం రిషీ క్యాబిన్ కే వచ్చేసిన శిరీష్

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర వసూని రిషీ దగ్గరకు వెళ్లమని చెప్తాడు. ధరణీ నిన్ను లోపలకి తీసుకెళ్తుంది నువ్వు వెళ్లి సార్ శిరీష్ వచ్చాడు అని చెప్పు అంటాడు. వసూ సరే సార్..ఈ ఆర్టికల్ పేపర్స్ కూడా చూపిస్తాను అంటుంది. అలా ధరణీ, వసూ రిషీ దగ్గరకు వెళ్తారు. శిరీష్ వసూ వెళ్లేకన్నా నేను వెళ్తే బాగుండేదేమో కదా అంటాడు. మహేంద్ర హే భలేవాడివి ఆఫీసర్..రిషీ మూడ్ ఎలా ఉంటుందో ఏమిటో తెలియదుకదా అంటాడు. అవునుసార్ అంటాడు శిరీష్. ధరణి వసూని రిషీ గదివరకూ తీసుకొచ్చి నాకు పనుంది అని చెప్పి వెళ్లిపోతుంది. వసూ రిషీ గదలిలోకి వెళ్తుంది. మనోడు కిక్ బాక్సింగ్ చేస్తుంటాడు. అది పిచ్చకోపంతో. వసూ లోపలకి రావచ్చా అన్నా కానీ ఏం మాట్లాడడు. కాసేపటకికి ఏంటి ఇద్దరు ఇంటికి వచ్చారు అంటాడు. వసూ మమ్మల్ని చూసి కూడా కిందకురాలేదా అనుకని శిరీష్ అని చెప్పబోతుంది. మీరు తీరిగ్గా ఉంటే అందరూ పనిపాటలేకుండా ఉంటారు అనుకున్నావా అంటాడు. పెళ్లిగురించి శిరీష్ అని చెప్పబోతుంది. రిషీ ఆ శాండ్ బాక్స్ ని గట్టిగా తంతాడు. వసూకి భయమేస్తుంది. రిషీ నేను కాలీగా లేను కలవటం కుదరదు అని చెప్పు అంటాడు. కింద మహేంద్ర పైన ఏం జరుగుతుందో ఏంటో..వసూకి ఎలాగో రిషీ మాట్లాడే అవకాశం ఇవ్వడు కాబట్టి రిషీ మనసులో మాట చెప్పేస్తాడు అనుకుంటాడు. వసూ శిరీష్ ఇక్కడి వరకూ వచ్చాడు అంటుంది. వచ్చినవాళ్లు వచ్చినదారినే వెళ్తారు..వెళ్లేవాళ్లు వెళ్తారు, ఉండేవాళ్లు ఉంటారు అంటాడు. వసూకి ఏం అర్థంకాదు. ఏంటో రిషీ సార్ ఈమధ్య మూడ్ ఆఫ్ లో ఉంటున్నారు అనుకుని సార్ ఈ ఆర్టికల్ పేపర్స్ అంటుంది. ఇప్పుడుకాదు అని రిషీ అరిచేసరికి పక్కన పెట్టేసి వెళ్తుంది. వసూ వెళ్లగానే రిషీ ఆ పేపర్స్ ని నలిపి డస్ట్ బిన్ లో వేస్తాడు.

వసూ దీనంగా కిందకు వస్తుంది. శిరీష్ వసూ ఏమైంది అని అడుగుతాడు. మహేంద్ర కూడా చాలా ఉత్సాహంగా రిషీ ఏమన్నాడు, ఏం మాట్లాడాడు అంటాడు. వసూ తర్వాత కలుస్తాను అని చెప్పమన్నారు అంటుంది. మహేంద్ర అంతేనా ఏం మాట్లాడలేదా అంటాడు. బిజీగా ఉన్నాను అని చెప్పమన్నారు సార్ అంటుంది. సరే సార్..నేను మళ్లీ కలుస్తాను చెప్పి శిరీష్, వసూలు వెళ్తారు.

కాలేజ్ లో వసూరాసిన ఆర్టికల్ గురించి స్టాఫ్ కి జగతి చెప్తుంది. వాళ్లు చాలా బాగుంది అంటారు. అలా వాళ్లు మిషన్ ఎడ్యుకషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటారు. ప్రాజెక్టు ద్వారా అన్ని కాలేజ్ స్టూడెంట్స్ ని వాలంటీర్స్ గా ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాము అని చెప్తుంది. అలా వాళ్లు ప్రాజెక్టు గురించి చర్చించుకుంటారు. ఇంకోవైపు రిషీ క్యాబిన్ లో మహేంద్ర ఉంటాడు. రిషీ వస్తాడు. గుడ్ మార్నింగ్ రిషీ అని మహేంద్ర అన్నా..రిషీ ఏం మాట్లాడడు. సీరియస్ గా వర్క్ చేసుకుంటాడు. ఏంటి రిషీ మూడ్ బాలేదా అంటాడు. నా మూడ్ బాలేదని మెడలో ఏమైనా ట్యాగ్ వేసుకుని తీరుగుతున్నానా అంటాడు. అలా ఏం లేదు అని మహేంద్ర మనసులో ఇంకెప్పుడు భయటపడతావురా, శిరీష్ వసూలను చూసి అయినా మనసులో మాట చెప్తావ్ అనుకుంటే చెప్పవేంట్రా అనుకుంటాడు. రిషీ చూసి ఏంటి ఏదో బాగా ఆలోచిస్తున్నారు అంటాడు. అదే పొద్దున శిరీష్ ఇంటికిచ్చాడు కదా అంటాడు. కాలేజ్ టాపిక్ ఏదైనా ఉంటే మాట్లాడండి అంటాడు రిషీ. మహేంద్ర అయినా కూడా శిరీష్ వసూల అంటూ ఏదో చెప్పబోతాడు..డాడ్ ప్లీజ్ వద్దని చెప్పాను కదా, మళ్లీ మళ్లీ ఆ టాపిక్ తీస్తున్నారు అంటాడు.

ఇంతలో జగతి వస్తుంది. రిషీ ఏంటి మీరు రమ్మన్నారా అంటాడు. ఏ లేదు లేదు నాకేం తెలియదు అంటాడు మహేంద్ర. రిషీ లోపలికి రమ్మంటాడు. జగతి వాలంటీర్స్ శిక్షణకు సంబంధించిన వివరాలు మొత్తం తయారుచేశాం సార్ అంటుంది. రిషీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి..మొదట స్టూడెంట్స్ కి సబ్జెక్టు చెప్పండి అంటాడు. రిషీ అలా కాలేజ్ పేరు నిలబెట్టాలి, స్టూడెంట్స్ ని పరీక్షలు సిద్దం చేద్దాం, మిషన్ ఎడ్యుకేషన్ కాలేజ్ లో ఒక భాగం మాత్రమే..అదే కాలేజ్ లక్ష్యం కాదు అంటాడు. మహేంద్ర ఇదే సెంటెన్స్ తి తిప్పి తిప్పి చెప్తాడు. నేను అదే చెప్తున్నాను కదా అంటాడు రిషీ. అలా వాళ్లు మాట్లాడుకుని జగతిని పంపిస్తారు. రిషీ తమరు కాలేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనే విషయాన్ని మర్చిపోతున్నారు కదా, పెళ్లిళ్లు, రాయబారాలు, మధ్యవర్తిత్వాలు ఎక్కువైపోతున్నాయి కదా అంటాడు. మహేంద్ర నేను వెళ్లొచ్చా అని పైకి లేస్తాడు. రిషీ డాడ్ ఈ మధ్య మీలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది ఏంటంటారు అంటాడు. అలాంటిదేం లేదు రిషీ..ప్రతిమనిషీ ఏదో ఒక చోట మారక తప్పదు అంటాడు.

ఇంకోవైపు వసూ క్లాస్ చెప్తుంది. అచ్చం రిషీ క్లాస్ చెప్పినట్లు చేస్తుంది. బోర్డు మీద రాస్తుంది. ఇంతలో రిషఈ వస్తాడు. స్టూడెంట్స్ లేస్తుంటే రిషీ సైగ చేస్తాడు. వసూ చూసుకోకుండా రిషీ లానే మాట్లాడుతుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో మహేంద్ర శిరీష్ ని తీసుకుని రిషీ క్యాబిన్ కి వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, మీరు పర్మిషన్ ఇస్తే వసూని తీసుకువెళ్తాను సార్ అంటాడు శిరీష్..మహేంద్ర అది ఇప్పుడు బయటపడతాడు అనుకుంటాడు. కానీ రిషీ మాత్రం అవునుకదా వసుధార లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది అంటాడు. వసూని కూడా క్యాబిన్ కి పిలిపస్తాడు. వసూ వస్తుంది. పెళ్లి కదా నువ్వు వెళ్లాలి కదా, పర్మిషన్ అడగటానికి వచ్చారు అంటాడు రిషీ. సోమవారం అయినా రిషీకి అసలు మ్యాటర్ తెలుస్తుందో లేదో చూడాలి.