గుప్పెడంత మనసు సెప్టెంబర్ 9 ఎపిసోడ్ 238: రిషీకి జగతీకి మధ్య మాటల యుద్ధం..నా పర్మిషన్ ఉంటేనే వసూని పంపుతా అన్న జగతి

గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషి అద్దం ముందు రెడీ అవుతూ ఉంటాడు. మహేంద్ర వచ్చి గుడ్ మార్నింగ్ రిషేంద్రబూషణ్ అంటాడు. ఈరోజు హాలిడేకదా పొద్దున్నే ఎందుకు లేచినట్లో అని రిషీ అడుగుతాడు. ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి అంటాడు మహేంద్ర. అడగాలనుకుంటే సూటిగా అడగండి..నేను చెప్తాను, ఎక్కడికి వెళ్తున్నానో అని రిషి అంటాడు. మహేంద్ర వద్దొద్దు అవసరం లేదు అంటాడు. రాత్రి బాగా లేట్ గా వచ్చారా అని రిషి అడుగుతాడు. హా..అక్కడ నేను నిన్ను చూశాను అని మహేంద్ర సారి చెప్తాడు. చూస్తో చూశారు సారి ఎందుకు అంటాడు రిషి. నాకెందుకు తెలియదు రిషి నువ్వెందుకు వస్తావో.. వసుధార కోసం వచ్చావ్ అంటాడు. వసుధార కోసం కాదు.. వసుధారతో పని ఉండి వచ్చాను అని రిషి క్లారిటీ ఇస్తాడు. రెండింటికి తేడా ఏంటో అని మహేంద్ర అంటాడు. రిషీ తనదైన స్టైల్లో చెప్తాడు. ఆరునెలలు సావాసం చేస్తేవాళ్లు వీళ్లు అవుతారామో అంటాడు. సామెత కరెక్టే కానీ.. సందర్భంగా కరెక్ట్ కాదు రిషి అని మహేంద్ర జగతిపై తనకున్న ప్రేమగురించి చెప్తాడు. నిజానికి ఈ సామెత నీకు సరిపోతుందని చెప్పి.. ఎంజాయ్ ది హాలిడే అని వెళ్లిపోతాడు. రిషి డాడేంటీ ఇలా అన్నారు.. వసుధార విషయంలో నేను మారానా అనుకుంటూ మనోవిశ్లేషణ చేస్తాడు.

ఇటుపక్క వసుధార వంటగదిలో బిజీగా ఉంటుంది. జగతి పిలిచి వసూ ఏం చేస్తున్నావ్ అంటే.. హాలిడేకదా మేడమ్ కొత్తగా కొన్ని స్నాక్స్ రెడీ చెస్తున్నా అంటుంది. మీకేం ఇష్టం మేడమ్ అని అడుగుతుంది. నాకేదైనా ఇష్టమే.. మహేంద్రకు కాజుఫ్రై అంటే ఇష్టం అంటుంది. వెంటనే వసుధార రిషీకి ఏం ఇష్టం అని అడిగేస్తుంది. పాపం జగతి.. ఏం ఇష్టం లేదంటే చెప్పగలను.. ఈ అమ్మ అంటే ఇష్టం లేదు వసూ అంటుంది.

ఇంకోవైపు కారులో ఉన్న రిషికి మహేంద్ర కాల్ చేస్తాడు. కాసేపు మాట్లాడుకుంటారు. ఎవరిఇష్టాలు వాళ్లవి అంటూ చర్చించుకుంటారు. వసుధారతో ఒక వర్క్ ప్లాన్ చేశాను ఆ పని మీదే వెళ్తున్నాం అంటాడు రిషీ. వసూ హడావిడిగా బ్యాగ్ సర్థకుంటుంది. జగతి ఏంటి వసూ.. స్నాక్స్ అంటున్నావ్, బ్యాగ్ సర్థుకుంటున్నావ్ అని అంటే.. రిషీ సార్ వచ్చారు కదా మేడమ్ కలిసి బయటకువెళ్తున్నాం అని వసూ అంటుంది. ఎక్కడికి అంటే వసూ తెలియదంటుంది. అలా ఎలా వెళ్తాం..నాకు చెప్పకుండా అంటుంది. వసూకి ఏం అర్థంకాదు.. మన రిషీ సార్ హే కాదా అని అంటుంది. అయితే ఎక్కడికో చెప్పాలికదా అని జగతి అంటుంది. నువ్వు నాతో ఉంటున్నప్పుడు నీ సంరక్షణ బాధ్యత నాదే కదా అని జగతి చెప్తుంది. ఇదేనా నువ్వు నాకిచ్చే విలువ అని అడుగుతుంది. వసూ ఏం చేయలకే కామ్ గా ఉంటుంది. ఇంతలో రిషి వచ్చి హారన్ కొడతాడు. వసూ రిషీ సర్ వచ్చారు మేడమ్ అంటుంది. రానీ ఇక్కడిదాకా వచ్చినవాడు లోపలికి రాడా అంటుంది. రిషీ కాల్ చేస్తాడు.. వసూ లిఫ్ట్ చేయదు.

రిషీ డైరెక్ట్ గా డోర్ దగ్గరకు వస్తాడు. ఏంటి లేట్ అని అడిగితే నేనే ఆపాను అని జగతి అంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది జగతి. మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద స్లంమ్ ఏరియా విసిట్స్ చేయడానికి వెళ్తున్నాం అంటాడు. నేను మిషన్ ఎడ్యుకేషన్ లో భాగాన్నే కదా.. ఫ్యాకెల్టీ హెడ్ ని ఈ ప్రాజెక్ట్ హెడ్ ని కదా అంటుంది. అయితే అని రిషి అంటాడు. నా పర్మిషన్ లేకుండా తనని ఎలా తీసుకెళ్తారు అని జగతి అంటుంది. రిషి షాకై ఎందుకు తీసుకోవాలి మేడమ్ అంటాడు. ఒక అమ్మాయి వేరే వాళ్లతో బయటకువెళ్తే నాకు తెలియాలి, నా పర్మిషన్ తీసుకోవాలి సర్. ఒకప్పుడు వసూ శిరీష్ తో సినిమాకు వెళ్లిందనుకుని మీరు నాకు చాలా జాగ్రత్తలు, సూచనలు చేశారు కదా అని గుర్తుచేస్తుంది జగతి.

రిషీకి సీన్ అర్థమవుతుంది.. టిట్ ఫర్ ట్యాట్ అనుకుంటాడు. జగతి మీరు ఎక్కడికి వెళ్తన్నారో, ఎ‌వరెవరూ వెళ్తున్నారో నాకు మెయిల్ పంపండి అఫీషియల్ గా అంటుంది. నేను మొదటి నుంచి అఫీషియల్ గానే ఆలోచిస్తాను మేడమ్ అంటాడు రిషి. పద్దతుల్ని ఫాలో అవుతున్నాను సర్ అంతకు మించి మరేం లేదు అని జగతి అంటుంది. పద్ధతుల్ని పాటించటం చాలా పద్ధతైన విషయం..ఇప్పుడే మెయిల్ పంపిస్తాను మీకు అఫీషియల్ గా అని నొక్కి చెప్పి కారులో కుర్చుంటాడు. జగతి మాటలను తలుచుకుని..నేనన్న మాటలను నాకే పాఠాలుగా మార్చి గుణపాఠం చెప్తుందా. తెలివితేటలు తనకే ఉన్నాయా చూస్తాను అనుకుని వెళ్లిపోతాడు.

ఇంకోవైపు మహేంద్ర ధరణీకి టైం ఉన్నప్పుడల్లా పుస్తకాలు చదువు, జ్ఞానం పెరుగుతుంది అంటూ పుస్తకాలు ఇవ్వబోతాడు. ఎన్ని పుస్తకాలు చదివినా ఏం లాభం మావయ్యగారు.. అత్తయ్యగారిమీద గెలవలేం కదా అంటుంది. మంచిరోజులు వస్తాయ్ అని ధరణీకి చెప్తూ ఉంటాడు. ఇంతలో జగతి మహేంద్రకు కాల్ చేసి జరిగిదంతా చెప్తుంది. వద్దంటే మన పుత్రరత్నం వింటాడా ఏంటి అని మహేంద్ర అంటాడు. నువ్వు నన్నే బెదిరస్తున్నావా అని జగతి అంటుంది. ఇంతకీ మీ ఇద్దరిలో వసూ ఎవరివైపు ఉందని మహేంద్ర అడుగుతాడు. భలే ప్రశ్న అడిగావ్ లే..వసూ ఆశ్యర్య పడింది. కొంచెం కోపం కూడా వచ్చినట్లు ఉంది అని జగతి అంటుంది. మహేంద్ర నవ్వుతూ..వసుధార నీ పార్టీనుంచి రిషీ పార్టీలోకి వెళ్తుందా అంటాడు. వసూ స్వతంత్రురాలు మహేంద్ర.. నేనెప్పుడూ తనని నా ఆలోచనలో బంధించలేదు.

అలా చేసిన ఉండే మనిషి కాదు అంటుంది. ఇంతకీ నేనెందుకు ఫోన్ చేశానో తెలుసా..అని వాయిగుండం తీరం దాటి నీవైపుకు దూసుకొస్తుంది అని అంటుంది. మహేంద్ర నవ్వుకుంటూ.. కొడుకు కోపంగా ఉన్నాడని భలే చెప్పావ్ జగతి..సరే సరే నేను చూసుకుంటా అని పోన్ పెట్టేస్తాడు.ఏమైంది మావయ్య అంటూ ధరణి అడుగుతుంది.. రిషీ కోపంగా ఉన్నాడని జగతి జాగ్రత్తలు చెప్తుంది నాకు అని ధరణీతో అంటాడు. అయినా రిషీ కోపాన్ని కూడా శాంతంగా స్వీకరిస్తారు కదా మవయ్యగారు అంటుంది. అవునమ్మా..రిషీ నా బలహీనత, జగతి నా బలం ఈ రెండింటిని కలపకుండా వదినగారు బాగా ప్రయత్నిస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ నాగుండెల్లోనే ఉంటారు అని చెప్పి వెళ్లిపోతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.