కార్తీకదీపం ఎపిసోడ్ 1201: దీప ఆత్మహత్య చేసుకోబోతుందా? ముందే తెలిసి బోరున విలుపిస్తున్న సౌందర్య

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో పిల్లలు సౌందర్యతో పండగన్నమాటే కానీ..అసలు అలానే లేదు అంటారు. అవునేరౌడీ నాకు కూడా అలానే ఉంది..మాట్లాడుకుంటూ..బయటకు వెళ్దామా, అమ్మబర్డే కూడా ఉందికదా అంటుంది. ఇంతలో దీప వెనుక నుంచి వస్తుంది. సౌందర్య దీపతో నీ బర్డేనా నేను మర్చిపోయాను అంటుంది. ప్రతిరోజు పుట్టిచచ్చివాళ్లకు బర్డే ఏం ఉంటుందిలే అంటుంది. గోల్కొండకోట కాదు..దానిపక్కన ఉన్న సమాధుల దగ్గరకు వెళ్దాం అంటుంది దీప. పండగపూట ఆ మాటలేంటే అని సౌందర్య అంటే..శౌర్య కూడా అవునమ్మా గుడికి వెళ్దాం తర్వాత రెస్టారెంట్ కి వెళ్దాం అంటారు. మీ నాన్నమ్మా గుడికి వెళ్లొచ్చారు కదా అంటుంది. సౌందర్యకు సౌండ్ ఉండదు. అలా దీప పరోక్షంగా కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. సౌందర్య వెళ్లిపోతుంది. పిల్లలు వెనుకనానమ్మ అని వెళ్తుంటే..దీప ఆపి..పెద్దవాళ్లు ఏం చేసినా ఎక్కడికి వెళ్లినా ఏంటి అని అడగకూడదు అంటుంది. పిల్లలతో కాసేపు కబుర్లు చెబుతుంది. ఈ పండుగకు డాక్టర్ బాబు నాకు గొప్ప బహుమతి ఇచ్చారుగా అందుకో ఇది నాకు ప్రత్యేకం అని పిల్లలకు దీప చెబుతుంది.

సౌందర్య రూంలో ఏడుస్తూ ఉంటుంది. ఆనంద్ రావు వచ్చి ఏంటి సౌందర్య ఏమైంది, నువ్వు ఇలా కళ్లనీళ్లు పెట్టుకుంటే..కార్తీక్ ఏమైపోతాడు చెప్పు అంటాడు. దీపను చూస్తే భయమేస్తుంది అండి, అవసరానికి మించి ఆనందంగా కనిపిస్తుంది, ఒకరకంగా చెప్పాలంటే..అందరిని ప్రేమించే వాళ్లు అందర్ని వదిలేముందు లేదా చనిపోయే ముందు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతుందండి అని పాపం సౌందర్య ఏడుస్తుంది. ఆనంద్ రావు ఓదారుస్తాడు. దానిమనసులో ఏముందో అడగాలనుకుంటున్నాను కానీ అడగలేకపోతున్నాను, దాని పుట్టినరోజు అంట రేపు.. పిల్లలు బయటకు వెళ్దాం అంటే..సమాధుల దగ్గరకు వెళ్దాం అంటుంది అని సౌందర్య చెప్పి కంటనీరు పెట్టుకుంటుంది.వీళ్లు ఇళా మాట్లాడుకుంటుండగా..కార్తీక్ వస్తాడు

కార్తీక్ కారు దిగగానే..దీప ఏక ధమ్ రెడీ అయి గుమ్మంలో నుల్చుంటుంది. మనోడికి ఏం అర్థంకాదు. బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ అయితే పిచ్చ హైలెట్ అసలు. కార్తీక్ వచ్చి కొంచెం లేట్ అయింది అంటాడు. ఇప్పుడేంటి స్వామి, లేట్ అయింది అంతేకదా, వెళ్లినపని అయిందా లేదా అంటుంది. దీప ఏంటి అంత కూల్ గా మాట్లాడుతుంది అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. దీప ఏంటి డాక్టర్ సాబ్ ఏమైంది అంటుంది. కార్తీక్ నీతో ఒక విషయం చెప్పాలి అని దీప చేతులు పట్టుకుని నేను ఏ తప్పు చేయలేదు. ఆ మోనితే అది సహజగర్భం అంటుంది, నువ్వు నమ్మకు దీప, నువ్వు ఒక్కదానివి నమ్మితే అదే చాలు అంటాడు. కట్ చేస్తే ఇదంతా కల. దీప డాక్టర్ బాబు ఏమైంది ఏ లోకంలోకి వెళ్లిపోయారు అని మాట్లాడుతుండగానే..ఫ్యామిలీ అంతా టపాసులు తీసుకుని బయటకు వస్తారు.

 

అసలేంటో..ఒక్కరి ముఖంలో సంతోషం ఉండదు..పండగ మాత్రం చేసుకుంటారు. దీప ఏంటి అందరూ డల్ గా ఉన్నారు..డాక్టర్ బాబు మీరే ముందు టపాసులు కాల్చాలి అంటుంది. ఆదిత్యతో ఏంటి ఆదిత్య డల్ గా ఉన్నావు..నేను ఒప్పుకోనుఅని ఈ దీపావళికి ఏదో తగ్గిందనిపిస్తుంది కదా..అదేంటో నేను తెస్తాను, ఇప్పుడే వస్తాను ఎ‌వరూ రావద్దు అని దీప లోపలికి వెళ్తుంది. ఇక్కడున్న వీళ్లకు భయమేస్తుంది. లోపలికి వెళ్లి ఏమైనా చేసుకుంటుందా అని టెన్షన్ పడతారు. దీప స్వీట్స్ తీసుకుని వచ్చి ఈ దీపకు దీపావళి ప్రత్యేకం..మళ్లీ ఈ దీపకు దీపావళి ఎప్పుడూ వస్తుందో ఏంటో అని అందరికి స్వీట్స్ తినిపెడుతుంది. పిల్లలు సంతోషంగా ఉంటారు. కానీ పెద్దోళ్లముఖాలు మాత్రం డల్ గా ఉంటాయి. దీప, పిల్లలు టపాసులు కాలుస్తారు. కార్తీక్ అండ్ ఫ్యామిలీ మాత్రం ఉత్సవవిగ్రహాలు లాగా నుల్చుంటారు.

దీప కార్తీక్ ను పిలిచి రండి కాలుద్దాం అని పిలుస్తుంది. ఇద్దరూ కలిసి కాకరపువ్వొత్తులు కాలుస్తారు. ఇంకోపక్క మోనిత ఆరోజు దీప అన్న మాటలను తలుచుకుంటూ ఉంటుంది. మోనిత సౌందర్యకు ఫోన్ చేస్తుంది. ఆన్టీ నేను మీ కోడల్ని అంటుంది ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయి భాగంలో మోనిత ఏకంగా కార్తీక్ ఇంటికే వస్తుంది. రేపు మా అబ్బాయి బారసాల ఉంది మీ అందరూ తప్పకుండా రావాలి అని చెబుతుంది. కార్తీక్ నోరు ముసుకుని బయటకువెళ్లు అంటాడు. దీప మాత్రం మోనిత నువ్వేళ్లి బారసాలకు ఏర్పాట్లు చేసుకో, వీళ్లందరిని తీసుకొచ్చే బాధ్యత నాది అని మోనిత దగ్గరకు వెళ్లి చెప్పాను కదా మోనిత..ఈ సినిమాకు క్లైమాక్స్ అదిరిపోయాలా చూపిస్తాను అని అది రేపే ఉంటుంది అంటుంది. దీప ఏం చూపిస్తుందో రేపు చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news