కార్తీకదీపం ఎపిసోడ్ 1215 : చేసిన తప్పుకు సౌందర్య సాయంతో పరిష్కారం ఆలోచించిన కార్తీక్..డాక్టర్ లైసెన్స్ పోయిందని మోనిత సంబరం

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో ఇంట్లో పిల్లలు, సౌందర్య, ఆదిత్య సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో దీనంగా నడుచుకుంటూ కార్తీక్ వస్తాడు. తండ్రిని చూసి పిల్లలు ఇద్దరూ హగ్ చేసుకుంటారు. కార్తీక్ కు ఆ పేషెంట్ భార్య తిట్టిన తిట్లే గుర్తుకువస్తాయి. ఎందుకు లేట్ అయిందని సౌందర్య అడుగుతుంది. సర్జరీ బాగా జరిగిందా అంటే..కార్తీక్ ఏం మాట్లాడడు. పిల్లలను చూసుకుంటాడు. మీకేం కాదమ్మా, నిండు నూరేళ్లు జీవిస్తారు అంటాడు. సౌందర్యకు అనుమానం వస్తుంది. పిల్లలను ఐస్ క్రీమ్ పేరుతో సైడ్ చేస్తుంది. కార్తీక్ ను అడుగుతుంది. కార్తీక్ ఏం లేదు మమ్మీ అంటాడు. సౌందర్య ఏం జరిగింది, ఎందుకు అంత డల్ గా ఉన్నావు అంటే..కార్తీక్ అలిసిపోయాను మమ్మీ అని వెళ్లిపోబోతాడు. ఆనంద్ రావు ఏమైందిరా ఆ మోనిత వచ్చి ఏమైనా గొడవచేసిందా అంటే.ఏం లేదు అని వెళ్లిపోతాడు.

karthika-deepam

మరోపక్క మోనిత ఆనందానికి పట్టపగ్గాలు ఉండావు. అయిపోయింది ప్రియమణి అయిపోయింది, కార్తీక్ పని అయిపోయింది, కార్తీక్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక కార్తీక్ డాక్టర్ కాడు..డాక్టర్ గిరి పోయింది..పోయేలా చేశాను నేను..దీప ఏం చేస్తుందో ఏంటో అని వెకిలి నవ్వు నవ్వుతుంది.

కార్తీక్ ఇంట్లో వాళ్లకు చెప్పకుండా..రూంలో ఒక్కడే బాధపపడుతూ ఉంటాడు. బ్యాక్ గ్రౌండ్ లో శాడ్ సాంగ్..పాపం ఏంటో ఈ డాక్టర్ బాబు పరిస్థితి. అసలే ఈ సీరియల్ మీద ప్రేక్షకులు విసుగు వస్తుంది. ఇంకా లైన్ మొత్తం మోనిత సైడ్ హే ఉంటే..చూసేవాళ్లకు ఏం చూడాలనిపిస్తుంది..ఎప్పుడూ కష్టాలేనా..హిరోసైడ్ కంటెంట్ ఉంటేనాగా ఎవరైనా ఇష్టంగా చూస్తారు..ప్రేక్షకుల్లో ఈ భావన అయితే ఉంది..కార్తీక్ ఏడ్చుకుంటూ..గోడమీద హిమ అంటించిన చాట్స్ అన్నీ తీసుకుని బాధపడుతుంటాడు. తప్పు చేసింది నేను..నన్ను శిక్షించాలి, నన్ను శపించండి..నా పిల్లలు ఏం చేశారు, ఏమైంది నాకు ఈ చేతుల్తో ఎన్నో సర్జరీలు చేశాను కదా..నా బాడీలో మార్పు ఎందుకు వచ్చింది, నా చేతులు ఎందుకు వణికాయ్ అని హాస్పటల్ లో జరిగిన సీన్ తలుచుకుంటాడు.

రవి, భారతి వాళ్లు తప్పు అంతా నీదే అంటూ నిందిస్తారు. కౌన్సిల్ ముందు విచారణ ఎదుర్కోవాలి, నీ డాక్టర్ లైసెన్స్ రద్దుచేస్తారు, కౌన్సిల్ తీసుకున్న ఏ నిర్ణయానికైనా నేను తలవంచుతాను అంటాడు. అక్కడున్న వాళ్లకు దణ్నం పెట్టి ఇంటికి వచ్చేస్తాడు. అది తలుచుకుని కార్తీక్ నేను డాక్టర్ కార్తీక్ ను కాదా అని తనలో తనే బాధపడతాడు. కార్తీక్ అలా బాధపడతూ ఉన్న సమయంలో సౌందర్య, ఆనంద్ రావులు వస్తారు. ఏమైంది రా అని మళ్లీ అడుగుతారు. కార్తీక్ అప్పుడు జరిగింది చెప్తాడు. ఒకమాట చెప్తాను కాదనకూడదు అని..మ్యూట్ లో ఏదో చెప్తాడు. దీప ఇంటికి వచ్చేలోపు ఈ పని జరిగిపోవాలి అంటాడు.

మరోపక్క ఆ పేషెంట్ భార్య..శవాన్ని ఎదురుగా పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్, సౌందర్య కారులో దిగుతారు. కార్తీక్ ను చూడగానే మళ్లీ ఆ‌విడ రెచ్చిపోతుంది. చూడు చూడు నువ్వు చంపేసిన నా మెగుడు అని ఏడుస్తుంది. మళ్లీ ఆవిడ చెప్పిన డైలాగ్స్ రిపీట్ చేసి సీన్ ల్యాగ్ చేస్తుంది. కార్తీక్ ఆవిడ చేతులు పట్టుకుని..నీకు అన్యాయం జరిగింది కాదనను, పోయిన మనిషి ప్రాణాలను తెచ్చివ్వలేను..కానీ ఒక్క పని చేయగలను అమ్మా అని సౌందర్య చేతలో ఉన్న ఫైల్ తీసుకుని ఆమెకు ఇస్తాడు. ఎపిసోడ్ అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news