కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో ఆనందరావుని చెక్ చేసిన డాక్టర్ భారతి.. అంకుల్ హెల్ట్ లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. కార్తీక్ వాళ్లు లేనందుకు బాధపడుతున్నారు కానీ అంతకుమించి ఎలాంటి సమస్య లేదంటుంది. అంకుల్ డిప్రెషన్లోకి వెళుతున్నారు జాగ్రత్త అంటుంది భారతి. అసలు సగం రచ్చ చేసింది ఈ భారతీనే..ఇక్కడు వచ్చి నీతులుచెప్తుంది మళ్లీ..ఆనంద్ రావు భాదతో కార్తీక్ వాళ్లు ఊరెళ్లారు..రేపు వస్తారో లేదా ఎళ్లుండి వస్తారో తెలిస్తే ధైర్యంగా ఉండొచ్చు..కానీ ఎప్పుడు వస్తారో తెలియని వాళ్లతో ధైర్యంగా ఎలా ఉండటం అని అక్కడినుంచి వెళ్తాడు. ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు ఎక్కువ సమయం ఒంటరిగానే ఉంటున్నారని చెబుతుంది సౌందర్య. భారతీ ఏదో చెప్తుంది. పరిష్కారం అంట..అది మనకు చెప్పలేదు. ఏదో సలహా ఇచ్చి అక్కడనుంచి వెళ్లిపోతుంది భారతి.
మోనిత
వంటలక్క ప్రజా వైద్యశాలలో కూర్చున్న మోనిత.. సౌందర్య ఆంటీ మీకు తెలివి తేటలు ఎక్కువని తెలుసు కానీ మరీ ఇన్నీ తెలివి తేటలు ఉన్నాయి అనుకోలేదు..ఫోన్ దొరికిన మహేశ్ ని పిలిపించి వాడికి డబ్బులిచ్చి రహస్యంగా వెతికిస్తారా..మీరెన్ని గేమ్ లు ఆడినా చివరకు విజయం నాదే..కార్తీక్ కోసం మీరు ప్రయత్నిస్తున్నారా..ప్రయత్నించండి.. ఈ మోనితని తక్కువ అంచనా వేస్తున్నారు కదా.. కానీ నా గేమ్ నేను ఎప్పుడో సెట్ చేసి పెట్టుకున్నా ఆంటీ అంటుంది. ఇంతలో ఫోన్ రింగవుతుంది.. ఓ కొత్త క్యారెక్టర్ ఎంటరైంది. హలో మేడం నేను విన్నీని మాట్లాడుతున్నా అంటూ అడ్రస్ చెప్పమని అడుగుతుంది. బస్తీ వాసులు నాకు వార్నింగ్ ఇస్తారా..విన్నీ వస్తోంది అనుకుంటుంది.
బ్యాగ్రౌండ్ లో కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది.. మన కార్తీక్ రోడ్డుమీద నడుచుకుంటూ..నువ్వు పేషెంట్ ని చంపేశావ్ అనే మాటల నుంచి రుద్రాణి బెదిరింపులు, దీప బాధ వరకూ అన్నీ గుర్తుచేసుకుని రోడ్డుపై గట్టిగా అరుస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన దీప..ఏమైంది మీకు అని తీసుకెళ్లి ఓ దగ్గర కూర్చోబెడుతుంది. ఇక్కడ దీప అవతారం చూడాలి..ఆ మోనిత బిడ్డను వీపుకు కట్టుకుని..చేతిలో రెండు సంచులుపెట్టుకుని పాపం అనిపిస్తుంది. ఏదో ఆలోచిస్తూ ఒకదానికొకటి అనుకుంటూ మనసు పాడుచేసుకోవద్దని చెబుతుంది దీప. నాకు భయంగా ఉంది, పిచ్చిపట్టేలా ఉందంటాడు కార్తీక్. జీవితంలో ఏం పోగొట్టుకున్నా జీవితాన్ని పోగొట్టుకోకూడదంటుంది దీప.. మనకు అన్నీ ఉన్నాయ్..డబ్బు, కార్లు, బంగళా ఇవి అంటారా..అవి లేకపోయినా కొన్ని కోట్లమంది సంతోషంగా ఉన్నారు, రేపు అత్తయ్య మావయ్యలకు మీరు ఇలా కనిపిస్తే వాళ్లకు ఏం సమాధానం చెప్పాలి అని. పిల్లలకు బాక్స్ ఇచ్చి రమ్మని పంపిస్తుంది.
సౌందర్య ఇంట్లో
ఇంట్లో కూర్చుని పిల్లల్ని తలుచుకుని సౌందర్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన ఆదిత్య, శ్రావ్య..డాడీ కనిపించడం లేదంటాడు. వాకింగ్ చేస్తున్నాడు అంటే..ఈ టైమ్ లోనా అంటాడు ఆదిత్య. ఆయన్ను చూస్తుంటే భయం వేస్తుంది..ఎవరితో మాట్లాడటం లేదు..వేళాపలా లేకుండా పచార్లు చేస్తున్నారు అంటుంది సౌందర్య. శ్రావ్య మవయ్యగారు బానే ఉన్నారు కద అత్తయ్య అంటే.. బయటకు బాగానే కనిపిస్తున్నా లోపల కుమిలిపోతున్నారు. భారతిని పిలిపించాను..మానసికంగా చాలా వీక్ గా ఉన్నారని ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం అని డాక్టర్ భారతి చెప్పిన విషయం చెబుతుంది. ఆదిత్య హాస్పటల్ కి తీసుకెళ్దాం అంటే..మందులతో మనోవ్యాధి తగ్గదు..ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్లమని భారతి సలహా ఇచ్చింది..తప్పదు తీసుకెళ్లాలని చెబుతుంది సౌందర్య. ఆ ఏర్పాట్లు చూస్తానన్న ఆదిత్య..
ప్రతి దుకాణానికి తిరిగి పిండివంటలు తీసుకోమని దీప అడుగుతుంది..కానీ దీపకు రుద్రాణి షాకిస్తుంది. దీప ఎంత బతిమిలాడినా.వాళ్లు తీసుకోరు…ప్యాకెట్ ఎంత అని షాపు అతను అడిగితే..ముప్పై రూపాయలు అంటుంది. మేము తీసుకున్నాం..వేరేవాళ్లు ఇచ్చారు. నువ్వు ప్యాకెట్ 30 రూపాయలు అంటున్నావ్.. రుద్రాణి 25 రూపాయలకే ఇచ్చిందని చెబుతాడు వ్యాపారి. రుద్రాణి పిండివంటలు అమ్మడం ఏంటని అడిగిన దీపకు..అవన్నీ నాకు తెలియదు… నీ దగ్గర కొనుక్కుని రుద్రాణితో గొడవ పెట్టుకోలేనంటాడు. ఆ తర్వాత దుకాణాలకు, ప్రతి ఇంటికి తిరిగినా ఎవరూ కొనరు.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరోవైపు స్కూల్ కి బాక్స్ తీసుకెళుతున్న కార్తీక్ మళ్లీ ఆలోచనల్లో పడతాడు..నేను ఏం అవుతున్నాను..ఇంటి భారం మొత్తం దీప మోస్తోంది..ఏదో ఒకటి చేసి దీప భారాన్ని తగ్గించాలి అనుకుంటాడు. స్కూల్లో పిల్లలు.. ఆకలేస్తోందని అనడంతో తీసుకొచ్చా కదా అని కార్తీక్ అనేలోగా..పక్కనుంచి ఓ పిల్ల వచ్చి తోసుకుంటూ వెళ్లిపోతే బాక్స్ కిందపడిపోతుంది. కార్తీక్ బాధపడుతుంటే అది చూసిన పిల్లలు మీరు ఇంటికి వెళ్లండి ఇంటికి వచ్చాక తింటా అంటారు. కార్తీక్..నేను వెళ్లి మీకు అన్నం తీసుకొస్తాను అని వెళ్తాడు. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్ లో
మీ బాకీ త్వరలోనే తీరుస్తా అన్న దీపతో.. లక్షల బాకీ ఇలా తిరుగుతూనే ఎలా తీరుస్తావ్ అంటుంది రుద్రాణి. సంక్రాంతి ఆఫర్ గా నీ పిల్లల్లో ఒకర్ని నాకిచ్చెయ్ అనగానే దీప కొట్టేందుకు చేయి పైకి లేపుతుంది. బాకీ ఎలా తీరుస్తారు పైనుంచి దేవుడు వస్తాడా అన్న రుద్రాణి మాటలకు..దేవుడే వస్తాడో-దేవతే వస్తుందో ఎవరికి తెలుసు అని నవ్వుకుంటూ వెళ్తుంది దీప. చూడబోతో ప్రకృతి వైద్యశాల పేరుతో..సౌందర్య వాళ్లు కూడా ఇదే ఊరికి వచ్చేలా ఉన్నారుగా.!
-Triveni Buskarowthu