అలర్ట్‌! వాట్సాప్లో వస్తున్న‌అమెజాన్‌ ఫ్రీ గిఫ్ట్‌ ఆఫర్‌కు మోసపోకండి

-

మీకు అమెజాన్‌ 30వ వార్షికోత్సవంలో భాగంగా ఫ్రీ గిఫ్ట్‌లను గెలుచుకునే అవకాశం అనే మెసేజ్‌ వచ్చిందా? అయితే జాగ్రత్త! ఇది నయా స్కాం.. మీ డేటాను చోరీ చేస్తుంది. ఈ నయా రకం మోసం ఏంటో తెలుసుకుందాం. ఇటీవల అమెజాన్‌ 30 వ వార్షికోత్సవంలో భాగంగా www.amazon.com ( https://amazon.bjzjwd.cn/amazc/load?v=fb1618904 )లో ఫ్రీ గిఫ్ట్‌లను ప్రతిఒక్కరికీ అందిస్తోందనే సందేవం హల్‌చల్‌ చేస్తోంది.  మీరు వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేస్తే, కొత్త విండో ఒపెన్‌ అవుతుంది. ‘ధన్యవాదాలు, మిమ్మల్ని ఫ్రీ గిఫ్ట్‌ సర్వేకి ఎంపిక చేశాం. దీనికి ఒక నిమిషం తర్వాత మీరు అద్భుతమైన గిఫ్ట్‌ బాక్స్‌ మీ సొంతం అవుతుంది’ అని హువాయి మేట్‌ 40 ప్రో 5జీ ఫోన్‌ 8జీబీ మెమొరీ ప్లస్‌ 256 జీబీ (బ్లాక్‌ కలర్‌) అని ఉంటుంది.

తమ సేవలను మెరుగుపరచుటకు వినియోగదారులు నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, వయస్సు, జెండర్, అమెజాన్‌ క్వాలిటీ సర్వీస్‌పై ఫీడ్‌బ్యాక్, అదేవిధంగా మీరు ఉపయోగించిన ఫోన్‌ ఆండ్రాయిడా లేదా ఐఫోన్‌ అనే ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు గిఫ్ట్‌ బాక్స్‌ల లిస్ట్‌ మీ డివైస్‌ స్క్రీన్‌పై వస్తుంది. మీరు వాటిలో ఒకటి సెలెక్ట్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుటు దీన్ని మరో 5 వాట్సాప్‌ గ్రూప్‌లలో లేదా 20 మంది వాట్సాప్‌ స్నేహితులకు షేర్‌ చేయమని అంటుంది. ఈ లింక్‌ ద్వారా వారిని కూడా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సింది సూచిస్తుంది. గిఫ్ట్‌ 5–7 రోజుల్లో డెలివరీ అవుతుందని తెలుపుతుంది. ఒకవేళ వినియోగదారులు దీన్ని ఫాలో అయితే వెంటనే మీ ఖాతా డెంజర్‌లో పడినట్లే.

మీ వ్యక్తిగత సమాచారం అంతా ఆర్థిక నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్లే. వినియోగదారులకు నిపుణులు సలహా ఏంటంటే దయచేసి ఎటువంటి లింక్‌ల ద్వారా కూడా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోకుండా ఉండండి. లేకపోతే మీ డివైజ్‌లోకి మాల్‌వేర్‌ ప్రవేశింపజేస్తారు. మీరు క్లిక్‌ చేయబోయే ఈ ఫేక్‌ లింక్‌ ద్వారా వచ్చిన మెసేజ్‌ను పరిశీలించి ఒకసారి తనిఖీ చేయండి. ఇది మాములు యూఆర్‌ఎల్‌ను పోలి ఉంటుంది. కానీ, దీన్ని స్కామర్లు తయారు చేసింది. ఒకసారి నిశితంగా పరిశీలిస్తే అందులో అవాంఛిత అక్షరాలు, జంక్‌ను కనుగోనవచ్చు. ఏదేమైన తెలియని లింక్‌లను క్లిక్‌ చేయకుండా ఉండటమే మంచిది.

అయితే సోషల్‌ మీడియాలో మాత్రం వినియోగదారులు ఈ గిఫ్ట్‌ మెసేజ్‌పై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఒకరికి వారం తర్వాత గిఫ్ట్‌ వచ్చిందని. మరొకరికి ఏమీ రాలేదు. ఫేక్‌ అని రెస్పండ్‌ అయ్యారు. ఇంకొకరు నెల తర్వాత గిఫ్ట్‌ అందుకున్నట్లు.. కొంత మంది ఇది ఫేక్‌ లింక్‌ను షేర్‌ చేయకండి అని స్పందించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news