ఎస్బీఐ: ఈ స్టేట్ బ్యాంక్ స్కీమ్ తో ప్రతీ నెలా అదిరే లాభం పొందొచ్చు..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. వీటి వలన చాలా ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఈ స్కీమ్ లో ఒకసారి డబ్బులు డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. ఇలా ఈ స్కీమ్ వలన చక్కటి లాభాలు పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే.. ఎస్బీఐ అందించే స్కీమ్స్ లో యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ లో ఒకసారి డబ్బులు డిపాజిట్ చేస్తే ప్రతీ నెలా డబ్బులని పొందొచ్చు. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో డబ్బులు అకౌంట్‌లో జమ అవుతాయి.

sbi | ఎస్‌బీఐ
sbi | ఎస్‌బీఐ

 

రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా డబ్బులు పొందాలంటే ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ కింద 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలల కాలానికి డిపాజిట్ చేయొచ్చు. ఈ స్కీమ్ ద్వారా నెలకు కనీసం రూ.1,000 పొందొచ్చు. అలానే కనీసం రూ.25,000 డిపాజిట్ చేయాలి.

గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. అలానే ఏ తేదీన డిపాజిట్ చేస్తే వచ్చే నెల నుంచి అదే తేదీలో డబ్బులు అకంట్‌లో జమ అవుతాయి. లేదా ఒక రోజు ముందు జమ అవుతాయి. ఇలా దీని వలన అదిరే లాభాలు పొందొచ్చు. అదే విధంగా ఓవర్‌డ్రాఫ్ట్ లేదా లోన్ సదుపాయం కూడా ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో బ్యాలెన్స్ మొత్తంలో 75 శాతం వరకు లోన్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news