రూ.1000 కడితే ఏకంగా రూ.26 లక్షలు వరకు పొందొచ్చు… ఎలా అంటే…?

మంచి రాబడి పొందాలని అనుకుంటున్నారా…? అయితే మీరు దీని గురించి తప్పక చూడాలి.
కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ అందిస్తోంది. వాటిలో ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకం కూడా ఒకటి. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే.. ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్‌లో నెలకు కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయం లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి.

ఇప్పుడు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ పై 7.1 శాతం వడ్డీ వస్తోంది. మీరు ఇందులో ఇన్వెస్ట్ చెయ్యాలంటే ఒక ఆర్థిక సంవత్సరం లో కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది. లేదంటే గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డబ్బులు పెట్టొచ్చు. ఇలా మీకు నచ్చినట్టు ఇందులో ఇన్వెస్ట్ చెయ్యవచ్చు.

పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఇందులో మీరు కనుక నెలకు రూ.1000 డిపాజిట్ చేస్తే…మెచ్యూరిటీలో రూ.26 లక్షలు పొందొచ్చు. కావాలంటే మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పెంచుకోవచ్చు.

నెలకు రూ.1000 పెడితే 15 ఏళ్లలో రూ.3.25 లక్షలు వస్తాయి. అదే పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలాన్ని 5 సార్లు ఎక్స్టెండ్ చేస్తే… 40 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మీ చేతికి రూ.26 లక్షలకు పైన వస్తాయి.