దోమలు ఎక్కువగా ఉన్నాయని డైలీ మస్కిటో కాయిల్స్‌ వాడుతున్నారా..?

-

ఈ సీజన్‌లో దోమలు ఎక్కువగా ఉంటాయి. పల్లె, పట్టణాలు అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ సాయంత్రం అయితే చాలు దండయాత్ర చేస్తుంటాయి. అందరూ దోమల నుంచి రక్షించుకోవడానికి.. మాస్కిటో కాయిల్స్‌ లేదా, రెఫెలెనెట్స్‌ వాడుతుంటారు. ఇవి దోమలను మాత్రమే చంపుతాయని మీరు అనుకుంటారు. కానీ అవి మనకు కూడా హాని కలిగిస్తాయి. దోమల కుట్టడం వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధితో కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతుంది. మీరు వాడే మస్కిటో కాయిల్స్‌ స్లో పాయిజన్‌లా మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.

దోమలను చంపేందుకు ఉపయోగించే మస్కిటో కాయిల్ నుండి వెలువడే పొగలను ఎక్కువగా పీల్చినప్పుడు, అది ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మస్కిటో కాయిల్స్‌లోని పదార్థాలు తలనొప్పిని ప్రేరేపిస్తాయి. అందుకే చాలా మందికి దోమల నివారణ మందు వాసన చూసిన వెంటనే తలనొప్పికి గురవుతారు. దోమలను చంపడానికి దోమల మందు వాడటం అంత మంచిది కాదు. వీలైనంత వరకు దాని వినియోగాన్ని తగ్గించండి.

మస్కిటో కాయిల్ ద్వారా చర్మంపై దద్దుర్లు, మంటలు వస్తాయి. మంట ఉన్నవారు దోమల నివారిణ కోసం దానిని వాడకూడదు. అది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. చర్మంపై దారుణంగా ప్రభావం చూపుతుంది.

దోమలను చంపడానికి ఉపయోగించే మస్కిటో కాయిల్స్‌లో క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ఈ క్యాన్సర్ కారకాలను రోజూ పీల్చితే.. అది ఊపిరితిత్తులలో క్యాన్సర్ కారక కణాల పెరుగుదల చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ప్రస్తుతం చాలా మంది ఆస్తమా, సీఓపీడీ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత కలుషిత వాతావరణం. అయితే, మీరు దోమలను చంపడానికి ఇంట్లో ప్రతిరోజూ కాయిల్ ఉపయోగిస్తే దాని పొగను పీల్చినట్లయితే మీరు ఆస్తమా, శ్వాస సమస్యలు, దగ్గుతో బాధపడవచ్చు. జాగ్రత్తగా ఉండండి.

ఇంట్లో పిల్లలు ఉంటే వీలైనంత వరకు దోమల మందును వాడకపోవడం మంచిది. రోజూ మస్కిటో కాయిల్‌ను వెలిగించి అందులోని పొగను పీల్చితే, రసాయనాలు పిల్లల్లో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దోమలు రాకుండా ఉండేందుకు కొన్ని రకాల దోమల తెరలు వాడండి. లేకపోతే సహజసిద్ధమైన మార్గాల ద్వారా దోమలను తరిమికొట్టవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news