ప్రతి ఒక్కరికీ ATM కార్డుతో బీమా ఉంటుంది.. రూ.50 వేల నుంచి రూ.కోటి వరకూ వస్తాయి

-

బ్యాంకులు ఏటీఎం కార్డు హోల్డర్లకు ప్రమాద బీమా కల్పిస్తున్నాయి. దాని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా, ప్రైవేట్ బ్యాంకు అయినా ఈ బీమా అందుబాటులో ఉంటుంది. ఈ బీమా రూ.50 వేల నుంచి కోటి రూపాయల వరకూ ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసా..? ప్రమాదంలో మరణిస్తే.. ఖాతాదారుకు ఆ మొత్తం చెల్లిస్తారు. ఏ బ్యాంకు ఏటీఎం కార్డులకు ఇలాంటి బీమా సదుపాయం ఉందో చూద్దామా..!

SBI

స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు ATM కార్డు ఆధారంగా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వివిధ రకాల బీమాలను అందిస్తోంది. విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలు బీమా ఉంది.

HDFC

HDFC డెబిట్ కార్డ్ రూ. 5 లక్షల బీమాను అందిస్తుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణంలో మరణిస్తే రూ.కోటి వరకు వచ్చే అవకాశం ఉంది.

ICICI

ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డ్ డెబిట్ కార్డ్ కస్టమర్లకు రూ.5 లక్షల బీమాను అందిస్తోంది. విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.30 లక్షల వరకు అందజేస్తుంది. గోల్డ్ డెబిట్ కార్డ్ కాకుండా ఇతర కార్డులు విమాన ప్రమాద బీమా కోసం రూ.50,000 మాత్రమే పొందుతాయి.

కోడాక్ మహీంద్రా బ్యాంక్

కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ.2 లక్షల నుండి బీమాను అందిస్తుంది. గోల్డ్ కార్డులకు 5. 15 వరకు, ప్లాటినం కార్డులకు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బీమా ఉంటుంది.

DBS

TBS ఇండియా బ్యాంక్ ATM కార్డ్ కస్టమర్లందరికీ రూ.5 లక్షల నుండి రూ. 1 కోటి వరకు ప్రమాద బీమాను అందిస్తుంది.

ATM కార్డ్ హోల్డర్ మరణించిన తర్వాత నిర్దిష్ట వ్యవధిలో కుటుంబ సభ్యులు ఈ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉందని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version