ఏటీఎం లో క్యాష్ లేకపోతే బ్యాంకులకు జరిమానా తప్పదు..!

-

కొన్ని కొన్ని సార్లు అత్యవసర పరిస్థితిలో ఏటీఎం కి వెళ్లి డబ్బులు డ్రా చెయ్యాల్సి వస్తుంది. అయితే డబ్బులు ఏటీఎం లో లేకపోతే మరో ఏటీఎం వద్దకి వెళ్లాల్సి వస్తుంది. ఇది చాలా మంది రెగ్యులర్ గా ఎదుర్కొనే సమస్యే. అయితే ఇప్పుడు మాత్రం కొత్త రూల్స్ వచ్చాయి. మనం బ్యాంక్‌ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్‌ మెయింటైన్‌ చేయకపోతే బ్యాంకులు ఎలా అయితే అడిషనల్‌ ఛార్జీలను వసూలు చేస్తాయో అదే విధంగా ఏటీఎంల లో నగదు అందుబాటులోకి లేదంటే ఆర్బీఐ భారీ ఎత్తున జరిమానా ఇక నుండి విధిస్తుంది.

అయితే ఖాళీ ఏటీఎంలతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులని పరిష్కరించడంపై దృష్టి పెట్టడానికి సిద్ధం అవుతోంది రిజర్వ్‌ బ్యాంక్‌. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 2,13,766 ఏటీఎంలు ఉన్నాయి. ఒక నెలలో మొత్తం 10 గంటలకు మించి ఏటీఎంలలో నగదు అందుబాటులో లేదు అంటే జరిమానా వేస్తుంది.

ఈ కొత్త రూల్స్ అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అందుకని బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లు ఎప్పటికప్పుడు చెక్ చెయ్యాలని ఆర్బీఐ చెప్పింది. ఒకవేళ ఈ రూల్స్ ని పాటించకపోతే జరిమానా తప్పదు. ఒక నెలలో పది గంటలకు మించి ఏ ఏటీఎంలోనైనా నగదు లేకపోతే, ఒక్కో ఏటీఎంకు రూ. 10,000 చొప్పున పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news