ఏప్రిల్ నుంచి భారీగా గ్యాస్ ధరలు పెంపు..ఎందుకంటే..?

ఏప్రిల్ నుంచి గ్యాస్ ధరలు పెరగొచ్చని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల తర్వాత ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెరిగేటట్టు కనపడుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా మళ్ళీ గ్యాస్ ధరలు పెరిగేటట్టు కనపడుతోంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న గ్యాస్ కొరత ఇందుకు కారణంగా నిలువనుంది.

Gas.jpg
Gas.jpg

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… గ్యాస్ సిలిండర్ ధర దగ్గరి నుంచి పీఎన్‌జీ, పీఎన్‌జీ, ఎలక్ట్రిసిటీ వంటి వాటి ధరలు కూడా పెరగనున్నాయని తెలుస్తోంది. అయితే ఫ్యాక్టరీలలో ఉత్పత్తి వ్యయాలు కూడా పైకి చేరేలా వుంది. ఇదే కనుక జరిగితే సామాన్యులపై ప్రభావం పడుతుంది.

కరోనా మహమ్మారి వలన ఎన్నో కష్టాలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే అవి తగ్గుతున్నాయి. దీని వల్ల అంతర్జాతీయంగా ఎనర్జీ డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో సరఫరా మాత్రం పెరగడం లేదు.

గ్యాస్ ధరలు దీనితో భారీగా పెరగొచ్చనే అంచనాలు వున్నాయి. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కారణంగా ఇప్పటికే దేశీ పరిశ్రమ ఎల్ఎన్‌జీ దిగుమతుల కోసం అధిక ధరలు చెల్లిస్తోందని నిపుణులు అంటున్నారు. ఏప్రిల్ నుంచి గ్యాస్ కొరత ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు పెరిగేలా కనపడుతోంది.

నేచురల్ గ్యాస్ ధరను ఎంఎంబీటీయూకు 2.9 డాలర్ల నుంచి 6 – 7 డాలర్లకు పెరగొచ్చని అంటున్నారు. ఇంచుమించు రెట్టింపు అవ్వచ్చు. డీప్ సీ గ్యాస్ ధర 6.13 డాలర్ల నుంచి 10 డాలర్లకు పెరగొచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటోంది.