పోస్టాఫీసు బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్..ఇక ఆ సేవలను ఇంట్లోనే పొందవచ్చు..!

-

పోస్టాఫీసు బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్ ను  చెప్పింది.. ఆధార్ కార్డు కు మొబైల్ నెంబర్ ను ఇంట్లోనే మార్చుకోవచ్చునని సదరు బ్యాంక్ తెలిపింది.పోస్ట్ మ్యాన్, గ్రామీణ డాక్ సేవకుల సాయంతో ఇంటి నుంచే ఆధార్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఐపీపీబీ తెలిపింది. ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకుకు చెందిన ముఖ్యమైన అలర్ట్‌లను పొందేందుకు తప్పనిసరిగా ఆధార్‌లో మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది.

ఇప్పటివరకు ఆధార్ లో మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకోవాలంటే ప్రత్యేక బ్యాంకు బ్రాంచులు లేదా పోస్టాఫీసులకు ప్రజలు వెళ్లేవారు. ప్రస్తుతం ఈ ప్రక్రియను మరింత సులభతరం చేశామని పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు తెలిపింది. ఐపీపీబీ చేసిన ట్వీట్ ప్రకారం..‘ముఖ్యమైన నోటిఫికేషన్‌లను పొందేందుకు ఆధార్‌లో మొబైల్ నెంబర్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే..మీ ఇంటి వద్దనే మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసేందుకు మీ పోస్ట్‌మ్యాన్, గ్రామీణ డాక్ సేవకులు సాయం చేస్తారు’ అని ఐపీపీబీ పేర్కొంది..అయితే ఈ సర్వీసు కోసం రూ.50 ప్లస్ ట్యాక్స్‌లు వర్తిస్తాయని దృష్టిలో ఉంచుకోవాలి..

ఇంటివద్దే ఈ సేవలను పొందేందుకు ఏం చెయ్యాలి..

  • కాల్ సెంటర్ 155299కి కాల్ చేసి సర్వీసు రిక్వెస్ట్‌ను పెట్టుకోవాలి.
  • జీడీఎస్, పోస్ట్‌మ్యాన్, పోస్టాపీసు ద్వారా కూడా అడ్-హాక్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.
  •   సర్వీసు డెలివరీ సమయాలు..
  • ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఎప్పుడైనా ఈ సర్వీసు డెలివరీకి సమయాన్ని కస్టమర్ ఎంపిక చేసుకోవచ్చు..

సర్వీసుల కొరకు చెల్లించవలసిన చార్జీలు..

పోస్టాఫీసు నుంచి ఒక కి.మీకి మించి కస్టమర్ సర్వీసు అందజేస్తున్నప్పుడు ఒక్కో విజిట్‌కి జీఎస్టీ ప్లస్ ఫ్లాట్ రూ.20ను ఛార్జీగా విధిస్తారు.

ఒకసారి కస్టమర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు.. ఎన్ని లావాదేవీలు నిర్వహించాలని అన్నదానిపై పరిమితి లేదు. అయితే అదే సమయంలో మరో కస్టమర్‌కి కూడా సేవలందిస్తే, చార్జీలను వేరు వేరుగా విధిస్తారు..

Read more RELATED
Recommended to you

Latest news