ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేశారా? మీ ఫోన్ హ్యాకర్స్ చేతుల్లోకి వెళ్లినట్టే..!

-

ఈ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నదో.. అంతే వేగంగా టెక్నాలజీ ముసుగులో ఎన్నో ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్. సైబర్ క్రైమ్ రోజురోజుకూ పెరిగిపోతూ స్మార్ట్ ఫోన్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నది. అందుకే… ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు కానీ.. సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేసేటప్పుడు.. స్మార్ట్‌ఫోన్‌లో డేటాను స్టోర్ చేసినప్పుడు.. ఏవైనా లింక్‌లు క్లిక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. ఒక్క క్లిక్‌తో సెన్సిటివ్ డేటా మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి ఎన్నో సైబర్ క్రైమ్స్ మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం.

హ్యాకర్స్‌కు దొరకకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే. జాగ్రత్తగా ఉండటం.. ఇంకా చెప్పాలంటే.. ఆండ్రాయిడ్ వినియోగదారులైతే గూగుల్ ప్లే స్టోర్‌లో ఏ యాప్ కనబడితే ఆ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోవద్దు. అది చాలా డేంజర్. ఎందుకంటే.. ఏ యాప్‌లో ఏ మాల్‌వేర్ ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే.. ప్లే స్టోర్‌లో ఉన్న డేంజరస్ అప్లికేషన్లను గూగుల్ ఇటీవలే తొలిగించింది. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా 85 యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ముఖ్యంగా గేమ్స్, టీవీ, రిమోట్ కంట్రోల్‌కు సంబంధించిన యాప్స్ వల్లనే డేటా ఎక్కువగా చోరీకి గురవుతున్నదని తెలుసుకున్న గూగుల్.. ఆ యాప్స్‌ను తొలగించింది.

అయితే.. ఈ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికీ… ఆయా యాప్స్‌ను వినియోగదారులు ఇదివరకే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అందుకే.. గూగుల్.. ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్స్ జాబితాను విడుదల చేసింది. ఆ యాప్స్ జాబితాను ఓసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు వాటిలో ఏ యాప్‌నైనా ఇన్‌స్టాల్ చేసుకున్నారో చెక్ చేసుకొని.. వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి.

SPORT TV
Prado Parking Simulator 3D
TV WORLD
City Extremepolis 100
American Muscle Car
Idle Drift
Offroad Extreme
Remote Control
Moto Racing
TV Remote
A/C Remote
Bus Driver
Trump Stickers
Love Stickers
TV EN ESPAÑOL
Christmas Stickers
Parking Game
TV EN ESPAÑOL
TV IN SPANISH
Brasil TV
Nigeria TV
WORLD TV
Drift Car Racing Driving
BRASIL TV
Golden
TV IN ENGLISH
Racing in Car 3D Game
Mustang Monster Truck Stunts
TDT España
Brasil TV
Challenge Car Stunts Game
Prado Car
UK TV
POLSKA TV
Universal TV Remote
Bus Simulator Pro
Photo Editor Collage 1
Spanish TV
Kisses
Prado Parking City
SPORT TV
Pirate Story
Extreme Trucks
Canais de TV do Brasil
Prado Car 10
TV SPANISH
Canada TV Channels 1
Prado Parking
3D Racing
TV
USA TV 50,000
GA Player
Real Drone Simulator
PORTUGAL TV
SPORT TV 1
SOUTH AFRICA TV
3d Monster Truck
ITALIA TV
Vietnam TV
Movies Stickers
Police Chase
South Africa TV
Garage Door Remote
Racing Car 3D
TV
TV Colombia
Racing Car 3D Game
World Tv
FRANCE TV
Hearts
TV of the World
WORLD TV
ESPAÑA TV
TV IN ENGLISH
TV World Channel
Televisão do Brasil
CHILE TV

Read more RELATED
Recommended to you

Latest news