ఘాటైన మిర్చి మన దేశంలోనే ఉంది?

-

ప్రపంచంలో మిర్చిని పలు దేశాలు పండిస్తాయి. మనదేశానికి సైతం ఈ మిర్చి కొన్ని వందల ఏండ్ల కిందట వచ్చిందని పరిశోధకులు పేర్కొంటారు. అయితే ప్రపంచంలో ఘాటైన మిర్చి మనదేశంలోని ఈశాన్యప్రాంతంలో పండిస్తారంటే అందరికీ ఆశ్చర్యం కానీ ఇది నిజం. ప్రపంచంలోనే ఘాటైన మిర్చీగా 2017లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికారడ్స్లో నాగా చిల్లీకి చోటు దక్కింది. నాగా చిల్లీని భూటాన్ కొండప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. దీన్ని స్థానికులు ‘భోట్ జోలోకియా’ పేరుతో పిలుస్తారు. దీనికే ‘కింగ్ చిల్లీ’ అని మరో పేరుంది.

ఔషధాల్లో నాగా చిల్లీ: ఈశాన్య ప్రాంతంలో పండే ఘాటైన మిరప నొప్పిని తగ్గించే ఔషధం కూడా పనిచేస్తుంది. నాగాలాండ్కు చెందిన పంచకర్మ వైద్యుడు ఇమ్లీకుంబా జమీర్ స్థానికంగా లభించే మిర్చీతో తయారుచేసిన మిశ్రమాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్సలో వాడేందుకు ఆయూష్ మంత్రిత్వ శాఖ ఈ మధ్యే ఆమోదం తెలిపింది. “ఘాటుగా ఉన్న మిశ్రమాన్ని (పేస్ట్) ఆయుర్వేద వైద్యంలో నొప్పిని తగ్గించేందుకు ఉపయోగిస్తారు. నేను ఘాటైన పేస్టు తయారీలో వాడే పదార్థాల్లో కొన్నింటిని మార్చాను. సాధారణ మిరప బదులు నాగా చిల్లీ, కొన్ని తమలపాకులు, అల్లం, వెల్లుల్లి, రాక్సాల్ట్, నువ్వుల నూనె ఉపయోగించాను’ అని వివరిస్తారు డాక్టర్ జమీర్. నాగాలాండ్లోని మొకాక్చుంగ్ పట్టణానికి చెందిన జమీర్ పంచకర్మలో మాస్టర్స్ చేశారు.

“స్థానికంగా లభించే పదార్థాలను, సరైన మోతాదులో వాడి తక్కువ ఖర్చుకే పేస్ట్ తయారుచేయొచ్చు. ఇది ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది కూడా. దీనిలోని పదార్థాలు నొప్పి ఉన్న కణజాలాల్లోకి తొందరగా చొచ్చుకెళతాయి. తొందరగా ఉపశమనాన్నిస్తాయి. పదిమందికి ఈ పేస్ట్తో చికిత్స చేశాను. వాపు లేకుండానే అందరికీ నయమైంది.

– కేశవ

 

 

Read more RELATED
Recommended to you

Latest news