దేశంలో ప్రతి ఒక్క లావాదేవీలకు ఆధార్ ఇప్పుడు తప్పనిసరి… అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఇది ఒకటి.ఆధార్ కార్డు లేదంటే చాలా కోల్పోతారు. ముఖ్యంగా ప్రభుత్వ సౌకర్యాలు పొందలేడు. చాలామంది ఆధార్ కార్డు జారీ అయిందంటే ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. దీనికి కూడా యూఐడీఏఐ నిబంధనలు జారీచేసింది. వీటి ప్రకారమే ఆధార్ అప్‌డేట్ జరుగుతుంది..
అయితే కార్డులో పుట్టిన తేదీ, పేరు, చిరునామా మార్చవచ్చు. కానీ మార్పు చేయడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. UIDAI ఏదైనా ఆధార్ కార్డ్ హోల్డర్ కోసం చిరునామాను మార్చడానికి పరిమితిని నిర్ణయించింది. ఆధార్‌లోని వివరాలను ఎలా, ఎన్నిసార్లు అప్‌డేట్ చేయవచ్చో దానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం..
ముందుగా ఆన్‌లైన్ సేవలను యాక్సెస్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరం. మొబైల్ నంబర్ అప్‌డేట్ లేకుంటే సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అప్‌డేట్ సెంటర్‌కు తప్పనిసరిగా వెళ్ళాలి..విషయానికొస్తే..
నిర్బంధ బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం
డెమోగ్రాఫిక్ అప్‌డేట్ రూ. 50
బయోమెట్రిక్ అప్‌డేట్ రూ. 100
బయోమెట్రిక్ విత్ డెమోగ్రాఫిక్ అప్‌డేట్ రూ. 100
A4 షీట్‌పై ఆధార్ డౌన్‌లోడ్, కలర్ ప్రింట్-అవుట్ ఒక్కో ఆధార్‌కు రూ.30.
UIDAI ప్రకారం ఆధార్ కార్డ్ హోల్డర్ తన పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు.
పుట్టిన తేదీని ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేయవచ్చు. లింగ వివరాలను ఒకసారి మాత్రమే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇంతకు మించి చేయాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి..ప్రతి ఒక్కదానికి అనుసంధానం చెయ్యడం మర్చిపోకండి… పాన్ కార్డు, ఓటర్ కార్డులతో లింక్ చెయ్యాలి లేకుంటే చాలా నష్టాలు జరుగుతాయి..