వచ్చే నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు?ఏయే రోజుల్లో సెలవులు..

-

ప్రతి రోజు చాలా మందికి బ్యాంకులలో ఎన్నో పనులు ఉంటాయి.. అయితే ప్రతి నెల కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అయితే బ్యాంకులకు నెలలో ఏయే రోజుల్లో మూసి ఉంటాయన్న విషయం ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.. సమయం వృధా కాకుండా, ఆర్థిక నష్టం కూడా కాదు.. బ్యాంకు వినియోగదారులు బ్యాంకులకు ఏయే రోజు సెలవులు ఉంటాయన్న విషయం ముందుస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి నెల, పండుగలు, వారాంతాల్లో కూడా దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు మూసివేయబడతాయి.

బ్యాంకుల సెలవుల జాబితా ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినెల విడుదల చేస్తుంటుంది. అయితే విడుదల చేసిన జాబితా లో బ్యాంకుల సెలవులు అన్ని రాష్ట్రాల కు వర్తించకపోవచ్చు.. మరి కొద్ది రోజుల్లో ఏప్రిల్ ముగిసిపోతుంది.. మే నెల కూడా రాబోతుంది.. ఇక వచ్చే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు రానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మే 1 – మేడే
మే 5 – బుద్ద పూర్ణిమ
మే 7- ఆదివారం
మే 9- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి
మే 13 – రెండో శనివారం
మే 14- ఆదివారం
మే 16 – రాష్ట్ర దినోత్సవం (సిక్కిం లో మాత్రమే)
మే 21- ఆదివారం
మే 22- మహారాణా ప్రతాప్‌ జయంతి
మే 24- కాజీ నజ్రుల్‌ ఇస్లాం జయంతి (త్రిపురా లో)
మే 27- నాలుగో శనివారం
మే 28- ఆదివారం..

పైన తెలిపిన రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే ముందే చూసుకోవడం మేలు..

Read more RELATED
Recommended to you

Exit mobile version