క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి…!

-

క్రెడిట్ కార్డు’ ఈ రోజుల్లో నిత్యవసరాల్లో ఒకటిగా మారిపోయి మన జీవితానికి ఎంత సహకరిస్తుందో అదే స్థాయిలో తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. క్రెడిట్ కార్డు కి అలవాటు పడిన వాళ్ళు ఇక నెల వారీ దాని వడ్డీలు కట్టడానికి కూడా అదే స్థాయిలో అలవాటు పడిపోయి ఆర్ధిక జీవనంలో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని విధాలుగా చూసినా సరే క్రెడిట్ కార్డు వలన నష్టాలే ఎక్కువగా కనపడతాయి. అయితే ఈ క్రెడిట్ కార్డు విషయంలో కొంత మంది మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు అయితే ఆర్ధిక జీవనం కొత్తగా ప్రారంభిస్తున్నారో,

ఎవరు అయితే ఉద్యోగం కొత్తగా చేస్తున్నారో వాళ్ళు మాత్రం క్రెడిట్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకు లు అన్ని కూడా క్రెడిట్ కార్డులు ఇస్తాయి, వాళ్ళ వ్యాపారం కోసం మిమ్మల్ని మభ్య పెడుతూ ఉంటాయి. వెనుక ఆస్తులు ఉన్నా లేకపోయినా సరే క్రెడిట్ స్కోర్, జీతం ఆధారంగా బ్యాంకు లు క్రెడిట్ కార్డులను ఇస్తూ ఉంటాయి. దీని వలన నష్టమే గాని లాభం లేదు. మీ వయసు 25 ఏళ్ళు అనుకోండి, ఇప్పుడే ఉద్యోగం మొదలుపెట్టారు… అంటే మీ ఆదాయం అనేది మొదలవుతుంది.

మీరు ఇప్పటి నుంచే క్రెడిట్ కార్డుని విలాసాలకు వాడటం మొదలుపెడితే, మీ సంపాదనలో అగ్ర భాగం వాటి రుణాలను కట్టడానికే సరిపోయే ప్రమాదం ఉంది. ఆర్ధిక జీవనం మొదటి నుంచి కూడా క్రెడిట్ కార్డుకి అలవాటు పడిన వాళ్ళు అయిదు, పదేళ్ళ తర్వాత తీవ్ర ఇబ్బందులు పడటం అనేది పక్కాగా జరుగుతుంది. మీరు ఎన్ని జాగ్రత్తలు ఏ విధంగా తీసుకున్నా సరే ఒక్కసారి క్రెడిట్ కార్డుకి అలవాటు పడితే మీరు అప్పుల పాలు అయిపోయే ప్రమాదం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో మీరు స్థిరపడిన తర్వాత మాత్రమే క్రెడిట్ కార్డు అనే ఆలోచన చేయండి. ఒక్కసారి అప్పుల పాలు అయితే మాత్రం తిరిగి కోలుకోవడం చిన్న వయసులో చాలా కష్టం.

Read more RELATED
Recommended to you

Latest news