రైతులకు రూ. 15 లక్షలు పొందే అవకాశం..పూర్తీ వివరాలు ఇవే..

-

రైతుల అవసరాలను తీర్చెందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తుంది. పిఎమ్ కిసాన్ తో పాటు మరెన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.అందులో భాగంగా కొంతమంది రైతులు కలిసి కొత్తగా వ్యవసాయం ప్రారంభించడానికి 15 లక్షల రూపాయలు అందజేస్తోంది.ఈ పథకం గురుంచి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రైతుల ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వం ‘పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ యోజన’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు రూ.15 లక్షలు అందజేస్తారు. కొత్తగా వ్యవసాయ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి 11 మంది రైతులు ఒక సంస్థ లేదా కంపెనీని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల రైతులకు వ్యవసాయ పరికరాలు లేదా ఎరువులు, విత్తనాలు, మందులు కొనుగోలు చేయడం చాలా సులువు అవుతుంది.

ఈ పథకం కోసం దరఖాస్తు..

ముందుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
అక్కడ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో FPO ఎంపికపై క్లిక్ చేయండి.
ఇప్పుడు ‘రిజిస్ట్రేషన్’ ఎంపికపై క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ ఫారమ్ మీ ముందు ఓపెన్‌ అవుతుంది.
ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని నింపండి.
తర్వాత స్కాన్ చేసిన పాస్‌బుక్‌ను అప్‌లోడ్ చేయండి.
తర్వాత సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

లాగిన్ చెయ్యడం ఎలా?

ముందుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
ఇప్పుడు మీ ముందు హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
తర్వాత మీరు FPO ఎంపికపై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు లాగిన్ ఎంపికపై క్లిక్ చేయండి.
తర్వాత లాగిన్ ఫారమ్ ఓపెన్‌ అవుతుంది.
ఇప్పుడు అందులో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయండి…

ఆ తర్వాత మీకు కావలసిన ఇంఫార్మెషన్ ను పొందండి..

Read more RELATED
Recommended to you

Latest news