ఈ పోస్టాఫీస్ స్కీమ్ తో కోటీశ్వరులు అవ్వొచ్చు…!

-

చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన మంచిగా బెనిఫిట్స్ ని పొందొచ్చు. మీరు కోటీశ్వరులు అవ్వాలని కల కంటున్నారా..? అందుకోసం ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే మీకు కొన్ని స్కీమ్స్ ఉంటాయి.

Postoffice
Postoffice

అయితే వీటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉపయోగకరంగా ఉంటుంది. పోస్టీఫీస్‌కు వెళ్లి మీరు ఈ స్కీమ్‌లో సులభంగానే చేరవచ్చు. లేదు అంటే బ్యాంక్స్ లో ఈ స్కీమ్ వుంది. అలా అయినా మీరు చేరచ్చు.

ఈ స్కీమ్ లో చేరడం వలన ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. ఇంకా 100 శాతం రిస్క్ లేనటువంటి ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఇది. మంచిగా రాబడిని కూడా ఈ స్కీమ్ తో పొందొచ్చు. ప్రస్తుతం ఈ పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ వస్తోంది.

ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ కాలం వచ్చేసి 15 ఏళ్లు. కావాలనుకుంటే ఐదేళ్లు ఎక్స్టెండ్ చేసుకోచ్చు. అందుకే ఎవరైనా పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే కోటీశ్వరులు కావొచ్చు. పీపీఎఫ్ ఖాతాలో నెలకు రూ.9 వేలు ఇన్వెస్ట్ చేయాలని మీరు అనుకుంటే 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్లాలి. ఇప్పడు మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.కోటి వరకు లభిస్తాయి. ఇలా ఈ స్కీమ్ తో చక్కగా ప్రాఫిట్స్ ని పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news