Kangana Ranaut: త్వరలోనే మనసైన వాడితో పెళ్లి.. కాంట్రవర్సీ క్వీన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ అంటే.. వెంట‌నే గుర్తు వ‌చ్చే పేరు కంగనా రనౌత్. అతి త‌క్కువ కాలంలో న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఈ హాట్ బ్యూటీ ప్రేమ, పెళ్లి గురించి త‌నదైన శైలిలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. త్వరలో మీకు అన్ని అన్నింటికీ స‌మాధానాలు దొరుకుతాయ‌ని, చెప్ప‌క‌నే చెప్పేసింది.

మీ ప్యూచ‌ర్ ఫ్లాన్స్ ఏంట‌నీ ప్ర‌శ్నించ‌గా.. రాబోయే ఐదేళ్లలో పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాను. పిల్ల‌ల్ని క‌నాల‌నుకుంటున్నాను. రాబోయే ఈ ఐదేండ్ల‌లో ఓ త‌ల్లిగా న‌న్నునేను చూడాల‌నుకుంటున్నానని త‌న ప్యూచ‌ర్ ఫ్లాన్ చెప్పి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం లైఫ్ లో ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నట్లు, తెలియజేశారు.

మీరు ఎవరితో అయినా రిలేషన్ షిప్ లో ఉన్నారా? అని ప్ర‌శ్నించ‌డంతో .. దిమ్మ తిరిగి పోయే సమాధానమిచ్చింది. నేను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అతని ప్రేమను తాను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. త్వరలో పెళ్లి చేసుకుంటాను. కానీ, అత‌ని పేరేంటో అనేది ఇప్పుడే చెప్ప‌ను. త్వరలో మీకు తెలుస్తాయి.. అంటూ షాకింగ్ రిప్లే ఇచ్చింది. క్యూరియాసిటీ పెంచేసింది. అయితే ఇప్పుడు కంగ‌నా మ‌న‌సులో ఉన్న ఆ స్పెష‌ల్ ప‌ర్స‌న్ ఎవ‌రు? అత‌డిని మీడియాకు ఎప్పుడూ ప‌రిచ‌యం చేస్తుందనేది బాలీవుడ్లో చ‌ర్చ‌నీయంగా మారింది.

కంగనా సినిమాల విష‌యానికి వ‌స్తే.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ధాకడ్ మూవీతో కంగనా
ఆక‌ట్టుకోవ‌డానికి రెడీ అయ్యారు. అర్జున్ రామ్ పాల్, దివ్య దత్త ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మరో చిత్రం తేజస్ లో కంగనా ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపించనున్నారు. మరోవైపు తన సొంత బ్యాన‌ర్‌లో టీకు వెడ్స్ షేరు అనే సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news