సామాన్యులకి ఇక్కట్లు తప్పేలా లేవు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో కొన్ని రోజుల నుండి మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేసాయి. అయితే ఇప్పుడు డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను కూడా పెంచాలని అనుకుంటున్నారు. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేయాలని అనుకుంటున్నాయి ఆయిల్ కంపెనీలు. అయితే ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కంపెనీలు రూ.105 వరకు పెంచాయి. ఇది ఇలా ఉండగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు మండిపోతున్నాయి.
నేడు బ్యారల్ 120 డాలర్లకు దగ్గర్లోకి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 150 డాలర్లకు చేరేటట్టే కనపడుతోంది. అయితే కమర్షియల్ సిలిండర్లపై ధరలను పెంచిన కంపెనీలు ఇప్పుడు ఈ డొమెస్టిక్ సిలెండర్లు ని పెంచేలా కనపడుతోంది.
ఇక కమర్షియల్ సిలిండర్ ధరలు విషయానికి వస్తే.. ఈ నెల 1న ఢిల్లీ లో కమర్షియల్ సిలిండర్ ధరలు ఒక్కో దాని పై రూ.1907 నుంచి రూ.2012కు చేరింది. అక్టోబర్ 6, 2021 నుంచి ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా వున్నాయి.