బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ హెచ్చరిక..!

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రజలను అలర్ట్ చేసింది. మోసాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయని మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక జాగ్రత్తగా ఉండక పోతే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పోగొట్టుకోవాల్సి రావొచ్చని హెచ్చరించింది ఆర్‌బీఐ. ఇది ఇలా ఉంటే మోసగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారని అని పేర్కొంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

RBI
RBI

ఈ మధ్య కాలంలో కేవైసీ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆర్బీఐ చెప్పింది. కనుక ప్రజలని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అకౌంట్ లాగిన్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, కేవైసీ డాక్యుమెంట్ల కాపీలు, కార్డ్ ఇన్‌ఫర్మేషన్, పిన్, పాస్‌వర్డ్, ఓటీపీ వంటి వాటిని ఎవ్వరికీ షేర్ చేయొద్దని కూడా చెప్పింది. అలానే తెలియని వారికి, ఏజెన్సీలకు తెలియజేయవద్దని కోరింది.

అనధికార వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్స్ ద్వారా డేటాను షేర్ చెయ్యద్దని కూడ అంది. ఇప్పుడు ఎక్కువగా మోసగాళ్లు కేవైసీ అప్‌డేట్ కోసం కాల్ చేస్తున్నారని… అలా చేస్తే బ్యాంక్ అధికారులను సంప్రదించాలని ఆర్‌బీఐ తెలిపింది. కేవైసీ గురించి మోసగాళ్లు నేరుగా కాల్ చేయొచ్చని లేదంటే ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా కూడా లింక్ పంపి మోసం చెయ్యచ్చని అంది. కనుక ఇలాంటివి వస్తే జాగ్రత్తగా వ్యవహరించమని ఆర్బీఐ కోరింది.