పోస్ట్‌ ఆఫీస్‌లో రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌.. రిస్క్‌ లేకుండా రూ. 8 లక్షలు రిటర్న్స్‌

-

పోస్ట్‌ ఆఫీస్‌ పొదుపు స్కీమ్స్‌లు ఎన్నో ఉంటాయి. చాలా మంది చిన్న మొత్తంలో డబ్బులను ఇక్కడే దాచుకుంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉన్న రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్స్ పెరిగింది. గతంలో 6.2 శాతంగా ఉన్న వడ్డీని 6.5 శాతం చేసింది కేంద్ర ప్రభుత్వం. 2023 జూలై-సెప్టెంబర్ కాలానికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. పదేళ్ల పాటు ప్రతీ నెలా కొంత మొత్తం పొదుపు చేయాలనుకునేవారికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ పొందొచ్చు.

పోస్ట్‌ ఆఫీస్‌

రికరింగ్ డిపాజిట్ వివరాలు

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం ప్రతీ పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో 18 ఏళ్లు దాటినవారు ఎవరైనా చేరొచ్చు. ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. మైనర్ల పేరు మీద గార్డియన్లు ఈ పథకం ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్‌లో కనీసం నెలకు రూ.100 నుంచి గరిష్టంగా ఎంతైనా పొదుపు చేయొచ్చు. మొదట ఐదేళ్ల కాలానికి రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరవొచ్చు. ఆ తర్వాత మరో ఐదేళ్లు ఈ అకౌంట్‌ని పొడిగించవచ్చు.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో ప్రస్తుతం 6.5 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే ఈ వడ్డీ జూలై-సెప్టెంబర్ కాలానికి మాత్రమే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్లను సవరిస్తుంది. కాబట్టి పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో నెలకు రూ.5,000 చొప్పున 10 ఏళ్లు పొదుపు చేస్తే ప్రస్తుత వడ్డీ రేటు 6.5 శాతం ప్రకారం రూ.8.46 లక్షల రిటర్న్స్ వస్తాయి. 10 ఏళ్లలో డిపాజిట్ చేసే మొత్తం రూ.6 లక్షలు అయితే రూ.2.46 లక్షల వడ్డీ లభిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం వడ్డీ రేటు పెంచితే ఎక్కువ రిటర్న్స్, వడ్డీ రేటు తగ్గిస్తే తక్కువ రిటర్న్స్ వస్తాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసిన మూడేళ్ల తర్వాత అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాది తర్వాత 50 శాతం లోన్ కూడా తీసుకోవచ్చు.

పోస్ట్ ఆఫీసులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉంటాయి. సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ లాంటి స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version