చాలామంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డబ్బులు ఆదా చేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో ఏ సమస్య రాకూడదని అనేక రకాల స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. పోస్ట్ ఆఫీస్ కూడా అనేక రకాల పథకాలను అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్న స్కీమ్స్ లో డబ్బులు పెట్టుకోవడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. మంచి రాబడి వస్తుంది. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీములలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ కూడా ఒకటి. ఇక ఈ స్కీమ్ కి సంబంధించిన వివరాలను చూద్దాం.
మహిళల పెద్ద మొత్తంలో డబ్బులు దాచుకోవడానికి ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా బెస్ట్ స్కీమ్స్ ని అందిస్తోంది. వాటిలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ కూడా ఒకటి. అధిక వడ్డీని దీని ద్వారా పొందవచ్చు. కొంతకాలం పాటు ఇందులో మహిళలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మంచి రాబడి వస్తుంది. ప్రస్తుతం మీరు పెట్టే పెట్టుబడికి 7.5% వరకు వడ్డీని పొందవచ్చు.
ఇందులో రెండేళ్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది గరిష్టంగా రెండు లక్షలు వరకు పెట్టొచ్చు. 2023 లో ఈ స్కీమ్ ని ప్రారంభించినప్పటికీ ప్రజాదరణ బాగా వచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ లో రెండేళ్ల పాటు రెండు లక్షలు పెడితే మొదటి సంవత్సరం 15000 వడ్డీ స్థిర వడ్డీ రేటు తో వచ్చే ఏడాది మొత్తం పై వచ్చే వడ్డీ 16,125 రెండేళ్లకు కేవలం రెండు లక్షలు పెట్టుబడి పెట్టి 31,125 ని పొందవచ్చు.