గ్యాస్ సిలిండర్ పై 300తగ్గింపు.. ఎలాగో తెలుసుకోండి..

Join Our Community
follow manalokam on social media

ప్రస్తుతం గ్యాస్ ధరలు విపరీతంగా పరిగాయి. కేవలం రెండు నెలల కాలంలోనే రెండు వందల రూపాయలు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఐతే గ్యాస్ సిలిండర్ కొనేవాళ్ళు సబ్సిడీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. గ్యాస్ ధర తక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీ తక్కువ వచ్చేది. ప్రస్తుతం ఎక్కువ ఉంది కాబట్టి సబ్సిడీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఐతే సబ్సిడీ రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. మీ ఆధార్ కార్డ్ గ్యాస్ కంపెనీతో కనెక్ట్ కాకపోవడం వల్ల, బ్యాంకు ఖాతాతో ఆధార్ నంబర్ అనుసంధానం కాకపోవడం వల్ల.

సబ్సిడీ ఎవరికి వర్తించదంటే?

ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం 10లక్ష్జలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే సబ్సిడీ రాదు. అలాగే వివాహం చేసుకున్నాక భార్యా భర్తల ఆదాయాలు కలిపి 10లక్షలు దాటితే వారికి కూడా సబ్సిడీ రాదు.

జీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం గ్యాస్ సబ్సిడీ 153.86 నుండి 291.48కి పెరిగింది. ఉజ్వల పథకం వారికి 174.86 నుండి రూ .312.48 సబ్సిడీ వస్తుందట. అంటే సుమారు 300రూపాయలు సబ్సిడీ వర్తించే వారికి ఆదా అవుతుందన్నమాట.

సబ్సిడీ పొందడానికి ఎల్పీజీ కనెక్షన్ కి ఆధార్ తో లింక్ చేయడం తప్పనిసరి. బ్యాంకు ఖాతాకి లింకు చేస్తేనే మీ సబ్సిడీ పొందగలరని తెలుసుకోండి.

ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం

మీ నమోదైన మొబైల్ నంబర్ నుండి ఎల్పీజీ కనెక్షన్ కంపెనీకి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. యునిక్ ఐడి అని టప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్ టైప్ చేసి గ్యాస్ కనెక్షన్ నంబరుకి మెసేజ్ పెడితే నిర్ధారణ కోసం మీకో మెసేజ్ వస్తుంది. కొద్ది సమయంలోనే మీ ఆధార్ నంబర్ గ్యాస్ కనెక్షన్ కంపెనీతో కనెక్ట్ అయిపోతుంది. బ్యాంకు ఖాతాకి ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాలంటే, ఆధార్ కార్డుని, ఖాతా పుస్తకాన్ని బ్యాంకులో ఇస్తే సరిపోతుంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...